అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడుకునే నైపుణ్య సామర్ధ్యాలను పెంపొందించడమే (ఎన్డిఆర్ఎఫ్) నేషనల్ డిజాస్టర్ అధారిటీ బృందం సభ్యుల ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 3 (మంగళవారం).

అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడుకునే నైపుణ్య సామర్ధ్యాలను పెంపొందించడమే (ఎన్డిఆర్ఎఫ్) నేషనల్ డిజాస్టర్ అధారిటీ బృందం సభ్యుల ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.
మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్డిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్, ఫైర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, డిఆర్డిఎ, సింగరేణి, జెన్కో అధికారులతో కలిసి జిల్లాలో ఎన్డిఆర్ఎఫ్ బృందం పర్యటన 15రోజుల కార్యాచరణ ప్రణాళిక పై సమీక్షించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్డిఆర్ఎఫ్ బృందం 20 మంది సభ్యులు 15 రోజులు జిల్లాలో పర్యటించి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని అనుకోని విపత్తు నుండి అనగా వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు వారి ప్రాణాలను వారే రక్షించుకునేలా మానసిక ధైర్యాన్ని పెంపొందించి వరదల్లో చిక్కుకున్న వారు ధైర్యంతో ఒడ్డుకు చేరుకునేలా సాహస యాత్ర నిర్వహించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటడం, వైద్య ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు పొందడం గురించి మాక్ డీల్ నిర్వహిస్తారన్నారు. ఎన్డిఆర్ఎఫ్ బృందం 15 రోజుల కార్యాచరణ ప్రణాళికలో నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రజా ప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేయాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుల పర్యటన విజయవంతం చేయాలని ఎవరైనావిధుల యందు క్రమశిక్షణ ఉల్లంఘన చేసినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్డిఆర్ఎఫ్ బృందం కమాండెంట్ ప్రదీప్ కుమార్, డిఆర్డిఏ పిడి పురుషోత్తం, జిల్లా వైద్యశాఖ అధికారి డా. శ్రీరామ్, డి.ఎస్.పి సంపత్ రావు, సింగరేణి జిఎం శ్రీనివాసరావు, జెన్కో ఎస్ఇ తిరుపతయ్య, యువజన,క్రీడల అభివృద్ధి అధికారి సునీత, కలెక్టర్ కార్యాలయ ఏఓ మహేష్ బాబు, తాసిల్దార్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post