అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ

Press note. 25.9.2021.

భవన నిర్మాణాలకు సంబంధించి సైట్ వెరిఫికేషన్ అయ్యాకే నిర్మాణాలు చేపట్టాలని, అనుమతి లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు.
శనివారం నాడు భువనగిరి మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులోని ఒక డప్లెక్స్ భవనం పైన అనుమతి లేకుండా నిర్మిస్తున్న పెంట్ హౌజ్ నిర్మాణం కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. TS B PASS సంబంధించి సైట్ వెరిఫికేషన్ లో ఈ భవన నిర్మాణానికి అనుమతి తిరస్కరించడం జరిగింది.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రరావు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

……DPRO. YADADRI.

 

Share This Post