అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు కొనసాగిస్తే కూల్చివేయక తప్పదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ హెచ్చరించారు

అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు కొనసాగిస్తే కూల్చివేయక తప్పదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ హెచ్చరించారు

అనుమతులను అతిక్రమించి నిర్మాణాలు కొనసాగిస్తే కూల్చివేయక తప్పదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ హెచ్చరించారు. శనివారం నాడు మెదక్ పట్టణంలో అనుమతులను అతిక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవన నిర్మాణాలను మునిసిపల్ కమీషనర్ శ్రీహరితో కలిసి దగ్గరుండి కూల్చి వేయించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మునిసిపల్ అనుమతి పొందిన ప్లాన్ ప్రకరామే భవన నిర్మాణాలు కొనసాగించాలని పలు మార్లు విజ్ఞప్తి చేస్తున్న నిబంధనలు అతిక్రమిస్తున్నారని అన్నారు. తద్వారా ఇతరులకు, ప్రభుత్వానికి ఇబ్బందులకు గురిచేయడమే గాక మీరు కూడా ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. కాబట్టి నూతన నిర్మాణాలు గావించే వారు అనుమతుల మేరకు నిర్మించుకోవాలని సూచించారు.
మెదక్ తో పాటు రామాయంపేట్, తూప్రాన్,నర్సాపూర్ మునుసిపాలిటీలలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తామని, కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే నిర్మాణాలు కొనసాగిస్తూ జిల్లా యంత్రాలంగానికి సహకరించవలసిందిగా ఆమె కోరారు.

Share This Post