అనుమతులు లేని ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి
ఇప్పటి వరకు 77 ఆసుపత్రులకు నోటీసులు జారి
డెంగ్యూ కేసులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
రక్త హీనత పరీక్షలు చేసి “ఎ షీల్” యాప్ నమోదు చేయాలని
హెచ్.బి. శాతం తక్కువగా ఉన్న పిల్లలకు ఐరన్ పోలిక్ మాత్రలు పంపిణి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
0 0 0 0
జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా చికిత్సలు అందిస్తున్న ఆసుపత్రులపై దాడులు చేసిన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అనుమతులు లేకుడా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, డెంగ్యూ మరియు గర్బిణీ స్త్రీల నమోదు అంశాలపై జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు, జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అనుమతులు పొందకుండా, అర్హతలు లేని వారు ప్రాక్టీసు చేస్తున్నవారిని గుర్తించి దాడులు నిర్వహించడంతో పాటు వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని వైద్యాదికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణ పరిదిలోని ఇప్పటి వరకు తనిఖీలు చేసి అనుమతులు లేని 77 ఆసుపత్రులకు నోటిసులు జారిచేయడం జరిగిందని తెలిపారు. వీరు తగిన సమయంలో స్పందించనియెడల వారిపైన అల్లోపతి క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. డెంగ్యూ వ్యాది విజృంబించకుండా ప్రతి మంగళ శుక్రవారాలలో స్థానిక సంస్థల సహాకారంతో డ్రైడే ను పాటించాలని తెలిపారు. ప్రత్యేకించి డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న గ్రామాలతో స్ప్రే చేయించాలని, నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయించి దోమల లార్వ అభివృద్ది చెందకుండా చూడాలని ఆయన తెలిపారు.
గర్బీణిల నమోదు తక్కువ శాతం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వారి స్థాయిలో సమీక్షించుకొని వందశాతం నమోదు చేయాలని తెలిపారు. రక్త హీనత పరీక్షలు చేసి “ఎ షీల్” యాప్ నమోదు చేయాలని, రక్త హీనత చేసిన పిదప హెచ్.బి. శాతం పరీక్ష చేసిన పిల్లల్లో తక్కువ శాతం ఉన్నవారికి తప్పనిసరిగా ఐరన్ పోలిక్ మాత్రలు పంపిణి చేసి వాడే విధంగా చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వార్, జిల్లా వైద్యాధికారి జువేరియా, డిపిఓ వీరబుచ్చయ్య, జిల్లా వైద్యాదికారులు, సిడిపిఓలు పాల్గోన్నారు.