అనుమతులు లేని నిర్మాణాలను మూడు రోజులలో గుర్తించాలి : జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లాలో సంబంధిత శాఖల అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించి, సమగ్ర విచారణ జరిపి మూడు రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.  జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీలు నియమించడం జరిగిందని, ప్రతి కమిటీలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, రోడ్డు భవనాల శాఖలతో పాటు ఇతర శాఖలను కమిటీల భాగస్వామ్యం చేయడం జరిగిందని, మున్సిపాలిటీ తోపాటు, గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన భవన నిర్మాణాలతో పాటు లేఅవుట్లు, ప్లాట్ల ఏర్పాటుపై పూర్తి స్థాయి వివరాలతో నివేదిక తయారు చేసి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 75 గజాలు, అంత కంటే తక్కువ స్థలంలో నిర్మాణం జరిగిన ఇండ్లను గుర్తించి, సంబంధిత యజమానులతో టోకెన్ ఫీజు కట్టించి, టి. ఎస్.-బి పాస్ లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల కమిషనర్లు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, రోడ్డు భవనాల శాఖ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది

Share This Post