అనేమియా ముక్త్ భారత్ పై జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ZP CEO ప్రియాంక.

పత్రికా ప్రకటన తేదీ: 29-11-2021
కరీంనగర్

కరీంనగర్ జిల్లాను రక్తహీనత లేని ( అనీమియా ముక్త్ ) జిల్లాగా మార్చాలి

పోషకాహార ప్రాధాన్యతను మహిళలకు వివరించాలి

ఈనెల 30 నుండి డిసెంబర్ 21 వరకు

14 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసుగల బాలికలు, మహిళలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించాలి

 

 

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

00000

 

బాలికలు, మహిళల్లో రక్తహీనత లేకుండా జిల్లాను అనీమియా ముక్త్ కరీంనగర్ జిల్లాగా మార్చాలి అని,ఇందుకోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనీమియా ముక్త్ కరీంనగర్ పై అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగినులు, మహిళా ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికలు, 14 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య గల మహిళలందరికీ రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు విరివిగా పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్నవారికి ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలని సూచించారు. రక్తహీనత పోషకాహార లోపం, పేదరికము తదితర కారణాల వల్ల వస్తుందని తెలిపారు. కార్యాలయాల్లో పనిచేసే మహిళ ఉద్యోగులు, మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలలో పనిచేసే మహిళలు, విద్యార్థినులకు విడతలవారీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి వచ్చేనెల డిసెంబర్ 21 తేదీ వరకు రక్తహీనత పరీక్షలను జరపాలని కలెక్టర్ తెలిపారు. పోష కాహారం ప్రాధాన్యతను మహిళలకు వివరించేలా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. 14 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలందరికీ రక్తహీనత పరీక్షలు నిర్వహించి, రక్తహీనత లోపం ఉన్నవారికి మందులు ఇవ్వాలని తెలిపారు. తద్వారా కరీంనగర్ జిల్లాను అనీమియా ముక్త్ కరీంనగర్ గా మార్చాలని పిలుపునిచ్చారు. అనంతరము రక్తహీనత- తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన మూడు రకాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా సంక్షేమ అధికారి బి. రవీందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, డి ఆర్ డి ఓ శ్రీలత, డి పి ఓ వీర బుచ్చయ్య, డి సి ఓ శ్రీ మాల, మార్కెటింగ్ శాఖ ఎడి పద్మావతి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి రావు, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రాజ్యలక్ష్మి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సుధాకర్ రెడ్డి, సి డి పి వో లు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post