అన్నారం బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో అధిక నీటితో పంటలు ముంపుకు గురవడానికి గల కారణాలను అన్నారం బ్యారేజీ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 17 (శుక్రవారం).

అన్నారం బ్యారేజ్ పరిసర ప్రాంతాలలో అధిక నీటితో పంటలు ముంపుకు గురవడానికి గల కారణాలను అన్నారం బ్యారేజీ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అన్నారం బ్యారేజీ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి అధిక వర్షాల అనంతరం అన్నారం బ్యారేజీ పరిసర దాదాపు ఆరు గ్రామాలలో పంటలు నీట మునగడానికి గల కారణాలు, ముంపుకు గురవుతున్న భూముల విస్తీర్ణం, ఎప్పటినుండి ముంపునకు గురవుతున్నాయి. తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో అన్నారం బ్యారేజ్ డిఈ పి.రవిచంద్ర, ఎఇ డి.శ్రవణ్, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, సూపరింటెండెంట్ రవికిరణ్, సెక్షన్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post