అన్ని గ్రామపంచాయితీలో మట్టి సంరక్షణ పనులు మరియు నీటి సంరక్షణ పనులు చేపట్టి వీలైనంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

అన్ని గ్రామపంచాయితీలో మట్టి సంరక్షణ పనులు మరియు నీటి సంరక్షణ పనులు చేపట్టి వీలైనంత  ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లు,పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు.ప్రతి గ్రామపంచాయితీలో ఒక ఫాంపాండ్  లేదా ఒక ఫిష్ పాండ్ పని  ప్రారంభించి ఎక్కువ మంది కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి   జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయక పథక సంచాలకులు,  మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తక్కువ పురోగతి చూపిన 5 గురు పంచాయితీ కార్యదర్శులతో  నర్సరీల పురోగతి, లేబర్ మొబిలైజేషన్, సి.సి.చార్జెస్,లేబర్ బడ్జెట్, జలశక్తి అభియాన్,తెలంగాణకు హరితహారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
20.11.2021 లోపు అన్ని గ్రామపంచాయితీ నర్సరీలలో పాలీథీన్ సంచులలో మట్టి నింపుట,సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్,ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట నవంబర్ 20 లోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సహాయక పథక సంచాలకులు  ప్రతి వారంలో 3 రోజులు మండలాలలో పర్యటించి రోజుకు 2-4 గ్రామాల్లో క్షేత్ర సందర్శన చేసి లేబర్ మొబిలైజేషన్ మరియు నర్సరీలలో పాలీథీన్ సంచులలో మట్టి నింపుట,సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్,ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట పూర్తయ్యేవిధంగా తగు చర్యలు గైకోనాలని అన్నారు.  సహాయక పథక సంచాలకులు,  అదనపు ప్రోగ్రాం అధికారులు ప్రతి వారానికి తమ ముందస్తు టూర్ షెడ్యూల్  జిల్లా గ్రామీణాభివృద్ధి  అధికారి కి సమర్పించాలని  జిల్లా కలెక్టర్  ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు రోజుకు 2-4 గ్రామాల్లో క్షేత్ర సందర్శన చేసి లేబర్ మొబిలైజేషన్ మరియు నర్సరీలలో పాలీథీన్ సంచులలో మట్టి నింపుట,సీడ్ కొనుగోలు మరియు సీడ్ డిబ్లింగ్,ప్రైమరీ బెడ్లు ఏర్పాటు చేయుట పూర్తయ్యేవిధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అధికారులు ప్రతి వారానికి తమ ముందస్తు టూర్ షెడ్యూల్  ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జిల్లా ప్రజా పరిషత్)కి సమర్పించాలని అన్నారు. మండల పంచాయత్ అధికారులు అధికారులు ప్రతి వారానికి తమ ముందస్తు టూర్ షెడ్యూల్  జిల్లా పంచాయత్ అధికారి కి సమర్పించాలన్నారు.  జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులు చేపట్టి వాటిని పూర్తి చేసి వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని అన్నారు. రీ విజిటింగ్ షెల్ఫ్ లో భాగంగా చేయటానికి వీలులేని పనులన్నింటినీ తీసివేసి శ్రమశక్తి సంఘాల భాగస్వామ్యంతో కూలీలు చేయటానికి అనువైన పనులను గుర్తించి ప్రతి గ్రామపంచాయితీలో 200%  షెల్ఫ్ రూపొందించాలని అన్నారు.  నేషనల్ హైవే, స్టేట్ హైవే,పీ.ఆర్.రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు వెంబడి అవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్లలలో ఎన్ని మొక్కలు నాటాలో ఖచ్చితమైన లెక్క ప్రకారం ఎస్టిమేట్స్ తయారుచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీయుత జిల్లా కలెక్టర్   యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు, ఏ.పి.ఓ.లు పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ వి.సి.లో డి.ఆర్.డి.ఓ కాళిందిని,జడ్.పి.డిప్యూటీ సి.ఈ. ఓ.కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share This Post