అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు

అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు  రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు.  శుక్రవారం మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో  గతం కన్నా పి.హెచ్.సీలలో పనితీరు మెరుగు అయినప్పటికిని కొన్ని పి.హెచ్.సి.ల్లో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు.  గర్భిణీలకు మొదటి త్రైమాసిక ఏ.ఎన్. సి రిజిస్ట్రేషన్, పి.హెచ్.సి లో ప్రసవాలు, ఎనిమియా కేసులు, సి-సెక్షన్ తో పాటు కుష్టు, టి.బి, ఎన్.సి.డి వంటి పారామిటర్ల పై సమీక్ష నిర్వహించారు.  రఘుపతి పేట, పెంట్లవెల్లి పి.హెచ్.సి ల్లో ఒక్క ప్రసవం సైతం జరగకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఇక నుండి ప్రతినెలా మొదటి శుక్రవారం రోజు వైద్య శాఖ పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఎనిమియా గర్భిణీలపై మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టిపెట్టి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఎనిమియా నుండి బయటపడే విధంగా చూడాలన్నారు.  పి.హెచ్.సి పరిధిలో ప్రసవాలకు ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లిన కేసులపై పి.హెచ్.సి స్థాయిలో సమీక్ష నిర్వహించాలని అందులో సిజేరియన్ అయినవాళ్ళ పూర్తి నివేదిక తీసుకోవాలని ఆదేశించారు.  ప్రతి డాక్టరు ఫోన్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  విధులపట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని  హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్ లాల్ నాయక్, డిప్యూటీ డి.యం.హెచ్.ఓ వెంకట దాస్,  ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఆప్తలమాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Share This Post