అన్ని బ్యాంకులలో దళిత బంధు హెల్ఫ్ డెస్కులు ఏర్పాటు.

బ్యాంకులలో దళిత బంధు హెల్ఫ్ డెస్కులు ఏర్పాటు:

000

హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంధు పథకం లబ్ధిదారుల అనుమానాలను నివృత్తి చేయుటకు వీలుగా అన్ని బ్యాంకులలో దళిత బంధు హెల్ఫ్ డెస్కులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలేట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. దళిత బంధు లబ్ధిదారుల అనుమానాలు నివృత్తి చేయుటకు హెల్ఫ్ డెస్కులు ఎంతో దోహదపడుతున్నాయి. జమ్మికుంట మండల కేంద్రం లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులలో దళిత బంధు లబ్ధిదారులకు సందేహాలు, అనుమానాల నివృత్తికి ప్రత్యేక దళిత బంధు హెల్ఫ్ డెస్కును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వేమూరి సాయికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా ఇల్లందకుంట మండలంలోని 15 గ్రామాలలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు ఇంతవరకు 2,938 ఖాతాలు తెరిచామని మేనేజర్ తెలిపారు. దళిత బంధు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అయిన వారందరికి మెస్సేజ్ లు పంపినట్లు తెలిపారు. దళిత బంధు లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం ఒకసారి డబ్బులు జమచేస్తే తిరిగి వెనక్కి పోవని, వారి ఖాతాలలోనే నిలువ ఉంటాయని తెలిపారు. లబ్ధిదారులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని బ్యాంకుకు వచ్చిన లబ్ధిదారులకు తెలుపుచున్నారు. దళిత బంధు పథకం క్రింద లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ గ్రౌండింగ్ కు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డబ్బులు విడుదల చేస్తామని అన్నారు. డైయిరీ యూనిట్లు ఎంచుకున్న లబ్ధిదారులకు ముందుగా షెడ్ల నిర్మాణానికి లక్ష రూపాయల చొప్పున విడుదల చేస్తామని, కొనుగోలు చేసిన పాడి గేదెలకు దళిత బంధు డబ్బులు చెల్లిస్తామని మేనేజర్ తెలిపారు. జమ్మికుంట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏర్పాటు చేసిన దళిత బంధు హెల్ఫ్ డెస్కులో దళిత బంధు లబ్ధిదారులకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సేవలందిస్తామని తెలిపారు.

జమ్మికుంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లో దళిత బంధు లబ్ధిదారులతో మాట్లాడుతున్న మేనేజర్ పి. గోపిచంద్:

జమ్మికుంట ఎస్.బి.ఐ. బ్యాంకులో సీనియర్ మేనేజర్ గోపిచంద్ దళిత బంధు లబ్ధిదారులకు స్వయంగా వారి అనుమానాలను నివృత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గోపిచంద్ మేనేజర్ వారి బ్యాంకుకు వచ్చు లబ్ధిదారుల వివరాలు తెలుసుకోని ఎప్పటికప్పుడు వారితో మమేకమై ఎలాంటి సమస్యలు లేకుండా వారికి సమాధానాలు చెప్పుతూ లబ్ధిదారుల మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఎస్.బి.ఐ. మేనేజర్ గోపిచంద్ మాట్లాడుతూ జమ్మికుంట ఎస్.బి.ఐ. బ్యాంకుకు జమ్మికుంట రూరల్ గ్రామాలను కేటాయించారని తెలిపారు.

ప్రశ్న:- 1. మీ బ్యాంకు లో ఎన్ని దళిత బంధు ఖాతాలు తెరిచారు?

మేనేజర్:- మా ఎస్.బి.ఐ. బ్యాంకులో 2,900 ల దళిత బంధు ఖాతాలు తెరిచాం.

ప్రశ్న :-2. ఎంత మంది ఖాతాలలో దళిత బంధు డబ్బులు జమ అయినాయి?

మేనేజర్:- 2,900 ల ఖాతాలలో డబ్బులు జమ అయినాయి.

ప్రశ్న :- 3 డబ్బులు జమ అయిన దళిత బంధు లబ్ధిదారులకు సంక్షిప్త సమాచారం పంపారా?

మేనేజర్:- డబ్బులు జమ అయిన లబ్ధిదారులందరికి సంక్షిప్త సమాచార పంపాం.

ప్రశ్న:- 4. అక్కౌంట్లలలో జమ అయిన డబ్బులు తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉందా?

మేనేజర్:- ఒకసారి లబ్ధిదారుల అక్కౌంట్ లో జమ అయిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి
పోవు.

ప్రశ్న:- 5. దళిత బంధు నిధులు వెనక్కి పొతావని పుకార్లు వస్తున్నాయి, దాని పై మీ ఎం
చర్య తీసుకుంటునారు?

మేనేజర్:- దళిత బంధు నిధులు వెనక్కి పోతావని పుకార్లు నమ్మకూడదు, బ్యాంకులో దళిత
బంధు లబ్ధిదారులకు సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ఫ్ డెస్క్ ఏర్పాటు చేసి వారి అనుమానాలను నివృత్తి చేస్తున్నాం.

ప్రశ్న: 6. దళిత బంధు అక్కౌంట్ లో జమ అయిన డబ్బులకు మిత్తి వస్తుందా?

మేనేజర్:- దళిత బంధు అక్కౌంట్ లోని డబ్బులకు ప్రతి నెల నెల మిత్తి జమ అవుతుంది.

ప్రశ్న: 7. దళిత బంధు డబ్బులు డ్రా చేసుకోవచ్చా?

మేనేజర్:- దళిత బంధు డబ్బులు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల గ్రౌండింగ్
సమయంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విడుదల చేస్తాం.

దళిత బంధు లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలందించుటకు ఎస్.బి.ఐ. , జమ్మికుంట బ్యాంకు ముందుంటుందని మేనేజర్ తెలిపారు.

Share This Post