అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్యేయం – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

పత్రికా ప్రకటన                                                          మహబూబ్ నగర్
5. 7 . 2021
____________
@అన్ని వర్గాల సంక్షేమమే తమ ధ్యేయం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా ,మహబూబ్ నగర్ మండలం, అల్లీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
2 కోట్ల ఒక లక్ష 60 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు .కోటి 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వడ్డెర కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన తాగునీటి ట్యాంక్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అల్లిపూర్ గ్రామానికి రోడ్డుతో పాటు, తాగునీరు, విద్యుత్ సబ్స్టేషన్, మూడు చెరువులలో పూడికతీత చేపట్టడం జరిగిందని, గ్రామంలో 143 మందికి నెలకు 3 లక్షల 50 వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని,మిగిలిన వారికి రెండు నెలల్లో పెన్షన్లు ఇస్తామని తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని ఆయన అన్నారు. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నదని ,అన్ని వర్గాలు ప్రజల సంక్షేమమే తమా ధ్యేయమని మంత్రి అన్నారు.
గ్రామ సర్పంచి ఆంజనేయులు మాట్లాడారు

మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస నందలాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, ఎంపిపి సుధాశ్రీ, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, ప్రజా గృహ నిర్మాణ శాఖ ఈ ఈ వైద్యం భాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఈ వెంకటరమణ ,ట్రాన్స్ కో ఎస్ ఈ మూర్తి,ఇతర అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

___________ జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, మహబూబ్ నగర్

Share This Post