అన్ని శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నోట్ కామ్ యాప్ లో తీసిన ఫొటోలతో నివేదికలు అంద చేయాలని జిల్లా  కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

అన్ని శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నోట్ కామ్ యాప్ లో తీసిన ఫొటోలతో నివేదికలు అంద చేయాలని జిల్లా  కలెక్టర్ అనుదీప్ తెలిపారు.  జిల్లా కలెక్టర్ ఆమోదం కొరకు సమర్పించిన వర్క్ బిల్లులకు సంబంధించి కొన్ని లోపాలను గమనించామని, గతంలో  సూచించిన విధంగా చేసిన పని యొక్క ఫోటోగ్రాఫ్‌లను జతచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల, అన్ని సూచించిన న్ని శాఖల జిల్లా అధికారులు,  మునిసిపల్ కమిషనర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు  సూచనలు జారీ చేసినట్లు చెప్పారు.
 పని బిల్లుల చెల్లింపు కోసం ఫైళ్లను సమర్పించేటప్పుడు పనికి సంబంధించిన ఫోటోలను జత చేయాలని,  పని
ప్రారంచించడానికి  ముందు, పనులు జరిగుతున్నపుడు అలాగే పనులు పూర్తి అయిన తదుపరి   స్థితిని తెలియచేయు ఫోటోలు నోట్ క్యామ్ యాప్ ద్వారా మాత్రమే తీసిన ఫోటోలను జత చేయాలని చెప్పారు. ఫొటోలతో పాటు పని పేరు, పథకం పేరు, గ్రామ పంచాయితీ మరియు మండలం పేరుతో సమగ్ర  పనుల వివరాలను తెలియ చేస్తూ  సంబంధిత అధికారుల సంతకాలతో ధ్రువీకరణతో పంపాలని చెప్పారు.  సర్పంచ్ లేదా వార్డ్ సభ్యులు కౌన్సిలర్ మొదలైన స్థానిక ప్రజా ప్రతినిధులు  పనులు పూర్తి చేయబడినట్లు  ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాలని చెప్పారు.అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ నిధుల  యొక్క స్థితిని తెలియ చేస్తూ  జిల్లా కలెక్టర్‌ ఆమోదం కొరకు  సమర్పించాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు,
ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు తప్పని సరిగా  సూచనలను అనుసరించాలని తెలిపారు.
Attachments area

Share This Post