అన్ని హంగులతో నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి… జిల్లా కలెక్టర్ నిఖిల.

అన్ని హంగులతో నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత R&B అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక శాసన సభ్యులు మెతుకు ఆనంద్ తో కలసి నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి చేపట్టిన పనులను పరిశీలించారు.
దాదాపు అన్ని పనులు పూర్తి అయ్యాయని, చిన్న చితక పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. A C లు, లిఫ్ట్ సరిగా పని చేస్తున్నాయా లేదా మరొక ఒకసారి పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయ నిర్మాణపు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో R&B EE లాల్ సింగ్, వికారాబాద్ RDO ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, AE లు లక్ష్మీనారాయణ, రాయుడు,
స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post