*అపెరల్ పార్క్ లోని గోకుల్ దాస్ ఇమేజెస్ పరిశ్రమకు ఈ నెలాఖరులోగా అనుమతులు మంజూరు చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, జనవరి 25: అపెరల్ పార్క్ లోని గోకుల్ దాస్ ఇమేజెస్ పరిశ్రమకు ఈ నెలాఖరులోగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశమందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఆపెరల్ పార్కులో నిర్మిస్తున్న గోకుల్ దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మిషన్ భగీరథ ద్వారా నీటి వసతి, ఆర్టీసీ రవాణా సౌకర్యము, ఇతర మౌళిక వసతులు కల్పించాల్సిందిగా సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో స్థాపించబోయే అగస్త్య సూపర్ ఫుడ్స్ పరిశ్రమకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని ఆయన సూచించారు. అలాగే జిల్లాలో టీఎస్ఐపాస్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని, అనుమతుల మంజూరులో జాప్యం తగదని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, హండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ జాయింట్ డైరెక్టర్ తస్నీమా, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ విజయ్ కుమార్, ఆర్&బి ఈఈ కిషన్ రావు, హాండ్లూమ్స్ ఏడీ సాగర్, సెస్ ఎండీ రామకృష్ణ, గోకుల్ దాస్ ఎండీ సుమీర్ జె హిందూజా, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సార్, తదితరులు పాల్గొన్నారు.