అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని కవాడి పల్లి గ్రామపంచాయతీ కార్యాలయమును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు.గురువారం అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని కవాడి పల్లి గ్రామపంచాయతీ కార్యాలయమును రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి నర్సిరీలలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలని , నాటిన మొక్కలను సంరక్షించాలని సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి, సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభిస్తున్న సందర్బంగా పాఠశాలల్లో పారిశుధ్యపనులను పూర్తి చేయాలని, ప్రతి పాఠశాలల్లో విద్యుత్ , నీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలు ప్రారంభం అయినా తర్వాత విద్యార్థులకు ఎవరికైనా జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స అందించాలని, టెస్టులు చేయించాలని సూచించారు. అనంతరం లస్కర్ గూడ గ్రామ పంచాయతీలోని వైకుంఠ ధామం , నర్సరీని పరిశీలించారు.
ఈ తనిఖీలో కలెక్టర్ తో పాటు డీఆర్ డీఏ పీడీ ప్రభాకర్ , అదనపు పీ.డి నీరజ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post