అభివృద్ది, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎకైక రాష్టం తెలంగాణ :: రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

పత్రికాప్రకటన తేదిః 23-09-2021
అభివృద్ది, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎకైక రాష్టం తెలంగాణ :: రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్
జగిత్యాల, సెప్టెంబర్ 23:రాష్ట్ర అభివృద్దే ప్రదాన అజెండాగా సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం జిల్లాలో ప్రవేశట్టిన పలు అభివృద్ది, శంకుస్థాపనల కార్యక్రమాలలో పాల్గోన్న మంత్రి వర్యులు, మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులు 3 కోట్లతో గొల్లపల్లి, మోతే రోడ్ వైకుఠదామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు భూమిపూజ చేసినారు. అనంతరం పద్మనాయక కళ్యాణమండపంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణి కార్యక్రమంలో పాల్గోని మాట్లాడుతూ, రాష్ట్ర అవిర్బావం అంనంతరం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా వందశాతం సబ్సిడి లను కూడా అందించి అనేక వర్గాలను అభివృద్ది పరచడం జరిగిందని పేర్కోన్నారు. గతంలో ఎన్నడు చూడని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కొరకు సమృద్దిగా బడ్జెట్ ను కేటాయించిందని, వికలాంగులు కార్యాలయాల చుట్టు తిరగడానికి వీలు లేకుండా ఇంటివద్ద నుండే దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ, 11రకాలైన 436 సహాయ ఉపకరణాలను మంజూరు చేయడం జరిగినదని తెలియజేశారు. కార్యాక్రమం ద్వారా వికాలాంగులకు 24 స్కూటీలు, 9 ల్యాప్ టాప్లు, 18 బ్యాటరి ఆదారిత వాహనాలు, 7 స్మాట్ ఫోన్లు, 40 శ్రవణయంత్రాలు, 8స్మాట్ కేయిన్, బుద్దిమాంద్యం గల పిల్లలకు ట్రైనింగ్ మెటిరియల్ ను అందించడం జరిగింది. వికాలంగులకు గతంలో చేతితో పెడల్ తిప్పె ట్రైసైకిళ్లను అందించగా, సుదుర ప్రాంతాలకు సైతం ప్రయాణం చేయడానికి వీలుండేలా అధునాతన సౌకర్యాలతో బ్యాటరి ఆదారంగా నడిచే ట్రైకిళ్లను అందించడం జరిగిందని పేర్కోన్నారు. జగిత్యాల జిల్లాలో16737 వికలాంగులకు ఒక్కొక్కరికి నెలకు 3016 చొప్పున 5.04 కోట్లను వయో వృద్దులకు ఆసరా పించన్లు ఒక్కొక్కరికి ప్రతి నెలకు 2016 చొప్పున 9.53 కోట్లులను పెన్షన్ రూపంలో అందించడం జరగుతుందని పేర్కోన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ కార్యక్రమాలతో పాటుగా, డబుల్ బెడ్ రూం పథకంలో సైతం 5% ఇళ్లను వికలాంగులకు కేటాయించడంతో పాటు అనేక కార్యక్రమాలను అమలుచేసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.
అనంతరం చివరగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నందు 1,58,000 చేప పిల్లలను విడిచిపెట్టడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టిందని , తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను కులవృత్తులను ఆధారపడి బ్రతికేవాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరుగుతున్నదని. అన్నారు.గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందని, గత సంవత్సరం లో తెలంగాణ రాష్ట్రం లో 2.34 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి జరిగిందని అన్నారు. అంతకన్నా ఈ సారీ ఉత్పత్తి పెంచి ఇతర రాష్ట్రాల కు ఎగుమతి తో చేయాలని, అలాగే ముదిరాజ్, గంగ పుత్రులకు ఉపాధి పెరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ, వికాలాంగులు దైవసమానులుగా బావించి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, వారి గౌరవాని, కీర్తప్రతిష్టలకు భంగం కలుగకుండా వారికి వికలాంగుల పించన్లు, ఉపకరణాలను పంపిణి చేయడం జరుగుతున్న ఎకైక రాష్ట్ర కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని పేర్కోన్నారు.
జగిత్యాల శాసన సభ్యులు డా. యం. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, వికలాంగులకు మంజూరు చేసిన ఉపకరణాలను సద్వీనియోగం చేసుకోని, అభివృద్ది చేందాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎరాష్ట్రంలొ లేని విధంగా పించన్లు, కళ్యాణలక్ష్మి, షాదిమబారక్ లాంటి అద్బుతమైన పథకాలను ప్రవేశపెట్టిన ఎకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్ని అన్నారు. జిల్లా అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన సందర్బంగా దన్యవాదాలను తెలియజేశారు. మైనారిటి ఫెల్పెర్ నుండి 4 కార్లను అందించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి, జిల్లా మహిళ, శిశు మరియ వయోవృద్దుల సంక్షేమ అధికారి నరేష్, మత్శ్యశాఖ అధికారి నరసింహరావు, మున్సిపల్ చైర్మన్ బోగశ్రావాణి,ధర్మపురి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగిసత్తెమ్మ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు మెంబెర్లు, తదితరులు పాల్గోన్నారు.

అభివృద్ది, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎకైక రాష్టం తెలంగాణ :: రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

అభివృద్ది, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎకైక రాష్టం తెలంగాణ :: రాష్ట్ర సంక్షేమశాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post