అభివృద్ధికి కాణాచి సిద్దిపేట : నూతన కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు

అభివృద్ధికి కాణాచి సిద్దిపేట
– సిద్దిపేట RDO గా ఇక్కడి నుంచే కెరీర్ ప్రారంభించా
– సిద్దిపేట జిల్లా నాకు సుపరిచితమైన ప్రాంతం
– అపరిష్కృత సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తా

– నూతన కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు
——————————


సిద్దిపేట 17, నవంబర్ 2021:

అభివృద్ధికి కాణాచి సిద్దిపేట జిల్లా …… సిద్దిపేట RDO గా కెరీర్ ప్రారంభించా ..సిద్దిపేట జిల్లా నాకు సుపరిచితమైన ప్రాంతం… గడా ప్రత్యేక అధికారిగా , జిల్లా సంయుక్త కలెక్టర్ గా 5 సంవత్సరాలకు పైగా పని చేశా …. జిల్లాలోని అపరిష్కృత సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు తెలిపారు .

సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు మాట్లాడారు .

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలలో ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావ వంతంగా అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు పేర్కొన్నారు . సిద్దిపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై త్వరగా సమీక్ష నిర్వహించి వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ, నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఆదేశానుసారం తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి స్టేటస్ తెలుసుకొని క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించి ముందుకు వెళ్తామని జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు పేర్కొన్నారు.

కలెక్టర్ గా నియామకమైన తర్వాత తొలిసారి idoc కి వచ్చిన జిల్లా నూతన కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు .

పేరుపెట్టి ఆప్యాయంగా పలకరిస్తూ… యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ

కలెక్టర్ ఆత్మీయ పలకరింపు …. ప్రజా ప్రతినిధులు,అధికారులు ,ప్రజల ఆనందం

సిద్దిపేట రెవెన్యూ డివిజన్ అధికారిగా కెరీర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు …ఇక్కడే గడా ప్రత్యేక అధికారిగా , సంయుక్త కలెక్టర్ గా పని చేసారు . అనతరం సంగారెడ్డి కలెక్టర్ గా పదోన్నతి పై వెళ్ళారు .

తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్ నియామకమైన జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు … idoc లోని తన ఛాంబర్ లో బుధవారం బాధ్యతలు చేపట్టారు .

బాధ్యతలు చేపట్టేందుకు శ్రీ హనుమంతరావు idoc కి వస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రజా ప్రతినిధులు , అధికారులు ,ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జిల్లా కలెక్టర్ కు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు .

అందరిని ఆప్యాయంగా పేరు పెట్టి జిల్లా కలెక్టర్ పలకరించారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసారు. ఇక్కడి నుంచి బదిలీ పై వెళ్లి చాలా కాలం అయినప్పటికీ తమను పేరు గుర్తుంచుకుని పలకరించడం పట్ల ప్రజా ప్రతినిధులు , అధికారులు ,ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు

జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో .. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ ,
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, రెవెన్యూ డివిజన్ అధికారులు శ్రీ జయ చంద్రా రెడ్డి, శ్రీ విజయేంద్ర రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ శ్రీ హరీష్, DRDO శ్రీ గోపాల్ రావు, జిల్లా సహకార అధికారి శ్రీ చంద్ర మోహన్ రెడ్డి ,జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం , అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు , కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు .

——————————
డీ.పీ.ఆర్.ఓ, సిద్ధిపేట కార్యాలయంచే జారీ చేయనైనది.
పాల్గొన్నారు.

Share This Post