అభివృద్ధిని కొనసాగించి జిల్లాను ఆదర్శవంతంగా నిలిపేందుకు ఒక టీము వర్కుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు నూతన సంవత్సర కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మనకు నూతన కలెక్టరేట్ అందుబాటులోకి రానున్నదని చెప్పారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కలెక్టరేట్ ఏర్పాటు : చేసుకున్నామని చెప్పారు. మన జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాలలు మణిహారం కానున్నాయని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నందున చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. అధికార యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు సేవలందించేందుకు కృషి చేస్తున్నారని, ఇదే స్పూర్తితో అభివృద్ధిని కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేటలో ఇటు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, మీడియా, ప్రజల సహాకారంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి ప్రభుత్వ ప్రాధాన్యతలను నెరవేర్చుటలో సిబ్బంది మంచిగా పని చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో హరితహారంలో మంచిగా మొక్కలు నాటామని ఎక్కడా చూసిన పచ్చని మొక్కలతో జిల్లా అలరారుతున్నదని, రానున్న కొన్ని రోజుల్లో ఎంతో ఆహ్లాదకరంగా తయారవుతుందని చెప్పారు. ఇక మన జిల్లాను స్వచ్ఛ జిల్లాగా తయారు చేయుటకు పారిశుద్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నట్లు చెప్పారు. రహదారులపై ఎక్కడా వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని, స్వచ్చ పల్లెలు, పట్టణాలను తయారు చేయుటకు ప్రజల సహాకారం కావాలని ఆయన పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుండి మన జిల్లాలకు సిబ్బంది రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. భాద్యతతో చేసే పనులు మన ఉద్యోగ జీవితానికి ఎంతో సంతృప్తి నిస్తాయని చెప్పారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ బ్రహ్మాండంగా జరుగుతున్నదని, ఏమైనా లోటుపాట్లుంటే అధిగమించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని చెప్పారు. మారుమూల ప్రాంతమైన మన జిల్లాలో పోషణలోపం వల్ల చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్నారని, లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో చిరుదాన్యాలతో కూడిన వంటలతో భోజనం పెడుతున్నట్లు చెప్పారు. మన జిల్లాను పోషణ లోపం లేని జిల్లాగా మార్చాలని చెప్పారు. గిరిజనులు అధికంగా నివసిస్తున్న జిల్లా, మారుమూల ప్రాంతమైన ఈ జిల్లాలో పనిచేయడం అదృష్టమని, సిబ్బంది ఒక చాలెంజ్ తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. మన ప్రాంత విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు జిల్లా కలెక్టర్కు పుష్ప గుచ్చాలు అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్టీ అశోకచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Share This Post