అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర. శనివారం భూపాలపల్లి జిల్లాలోని మలహర్ రావు, భూపాలపల్లి మండలాలలో కలెక్టర్ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా సందర్శించారు

అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర. శనివారం భూపాలపల్లి జిల్లాలోని మలహర్ రావు, భూపాలపల్లి మండలాలలో కలెక్టర్ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా సందర్శించారు. మలహర్రావ్ మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టిన అమృత్ సరోవర్ చెరువు ను కలెక్టర్ పరిశీలించారు. చెరువు కట్ట యొక్క నాణ్యత
ప్రమాణాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు ఆయకట్టు కింద ఉన్న 20 ఎకరాలను ఆయకట్టు రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువు యొక్క మత్తడి పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. ఆయకట్ట రైతులు చెరువు మంజూరు చేసినందుకు సంతోషంగా రైతులు వారు తయారుచేసిన నాగలిని కలెక్టర్కు బహూక రించి వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా  నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. దీనిలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మొక్క,మొక్క మద్య ఉండవలసిన దూరం మరియు ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు పూర్తిస్థాయిలో అంచనా ప్రకారం పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలను డబ్బులు వస్తున్నాయా లేదా వారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి అన్సాన్పల్లి గ్రామపంచాయతీలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు మనబడి లో భాగంగా చేపట్టిన పనులను తరగతిలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో విద్యుత్ కొరకు వాడిన స్విచ్ బోర్డులు నాణ్యత పరంగా లేవన్నారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు త్వరగా తిన పూర్తి చేయాలని మండల ఎఈ అశోక్ ఆదేశించారు. అన్ సానిపల్లి గ్రామ రైతులు మహిళలు తమకు కొత్త పాసుపుస్తకాలు రాలేదని ధరణిలో నమోదు కావడం లేదని మహిళలు కలెక్టర్కు తెలుపగా, వెంటనే పూర్తి వివరాలు సమర్పించవలసిందిగా తాసిల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. భూపాలపల్లి మండలంలోని కొంపల్లి గ్రామంలో చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మొత్తం 26వేలరకాల వివిధ మొక్కలను నాటాలని పూర్తిస్థాయిలో మొక్కలు నాటి చిచ్చడివిని తలపించేలా ఉండాలని కలెక్టర్ తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించడానికి కలెక్టర్ కొంపెల్లి గ్రామ చెరువు కట్టపై సుమారు రెండు కిలోమీటర్లు వర్షంలో తడుస్తూ, బురదలో నడుస్తూ కలెక్టర్ బృహత్ పల్లె పకృతి వనాన్ని సందర్శించారు. నాచారం, కొంపెల్లి గ్రామాలలో కలెక్టర్ మొక్కలు నాటారు.            ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, ఎంపీపీ మలహర్రావు డిఆర్డిఓ పిడి పురుషోత్తం, ఎంపీడీవోలు మూర్తి, అనిల్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post