అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి – జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి

నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల గ్రామాల్లో 15 ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ జర్నల్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నాగర్ నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య అన్నారు.
బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని విద్యుత్, రోడ్లు భవనాల, మిషన్ భగీరథ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ..
15వ ఆర్థిక సంఘం మరియు జిల్లా పరిషత్ జర్నల్ నిధుల నుండి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
అందుకు అధికారులు నిరంతరం వాటిపై దృష్టి సారించి నిర్మాణాలు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా చూడాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీటిని నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కుటుంబ సముదాయాలతో పాటు రైతు వేదికలు వైకుంఠ గ్రామాలు పాఠశాలలు అంగన్వాడీలకు 100% నీటిని అందజేయాలని ఆదేశించారు.
15 ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ జర్నల్ నిధుల నుండి జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు.
వ్యవసాయ బావుల నూతన కనెక్షన్లను త్వరిత గతిన ఇచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గ పరిధిలో పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టే విద్యుత్ మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు నేటి సమావేశానికి హాజరు కానందున ఆ శాఖ సమీక్షను మరొక రోజు తీసుకోవాల్సిందిగా చైర్మన్ ఆదేశించారు.
ఈ సమావేశంలో బిజినపల్లి జెడ్పిటిసి హరి చరణ్ రెడ్డి, తిమ్మాజిపేట జడ్పిటిసి దయాకర్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈవో ఉష డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post