అభివృద్ధి పనులలో పురోగతి కనబరచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

అభివృద్ధి పనులలో పురోగతి కనబరచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, సెప్టెంబర్ 17: జిల్లాలో RWS, EEPR శాఖల ద్వారా చేపపడుతున్న పలు అభివృద్ధి పనులలో అలస్యం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంనుండి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ మరియు యంపిడిఓ లతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 2015 – 16 నుండి 2018-19 వరకు 11 కోట్లతో(CDP) నియోజక వర్గ అభివృద్ది పథకం క్రింద మంజూరైన 658 పనులను త్వరగా పూర్తిచేయాలని, పరిపాలన అనుమతులు మంజూరై నెల రోజులలోగా ప్రారంభించని పనుల వివరాలను పంపించినట్లయితె వాటిని వెంటనే రద్దు చేయడం జరగుతుందని పేర్కోన్నారు. పూర్తయిన పనులకు సబంధించిన బిల్లులను అన్ లైన్ లో నమాదు చేసి సిపిఓకు అందజేయాలని, పురోగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని, పనుల పురోగతిపై మరో వారంలో సమీక్షిస్తానని, చిన్నపనులను త్వరగా పూర్తిచేసి, వారంలో నివేధిక పంపించాలని, నెల రోజులలో పెండింగ్ లేకుండా పనులు వేగంగా పూర్తిచేయలని పేర్కోన్నారు. ఈ నిర్మాణ పనులపై అలసత్వం వహించరాదని, పనులు చేయడంలో ఎజెన్సి వారు నిర్లక్ష్యం వహిస్తున్నట్లయితే వారిని తొలగించి కొత్తవారితో పనులు చేయించాలని సూచించారు. వైకుఠదామాలలో సోలార్ లైట్ల ఏర్పాటు కొరకు కమిటి ఏర్పాటు ద్వారా గాని ఇతర జిల్లాలో ఏవిధంగా చేస్తున్నారో తెలుసుకొని ఆపద్దతిలో గాని లైట్లను ఏర్పాటు చేయాలని పేర్కోన్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని, కమ్యూనిటి హల్ కొరకు స్థలాన్ని కేటాయించిన వాటిలో ఇతర సమస్యల వలన నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంబించగలిగితె వెంటనే ప్రారంభించాలని, చేయలేని వాటిని రద్దు చేయుటకు ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలను గుర్తించి వాటిని తొలగించి, పునరుద్దరణ పనులను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రజాప్రతినిధుల ద్వారా అవగాహన కల్పించాలని పేర్కోన్నారు.

అభివృద్ధి పనులలో పురోగతి కనబరచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post