*అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12: పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో పంచాయితీ రాజ్, సాంఘీక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించి, గ్రామ పంచాయితీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనులు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన పథకంలో భాగంగా నిర్మిస్తున్న 34 గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలను రాబోయే రెండు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 5 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 35 హెల్త్ సబ్ సెంటర్ల భవనాలను ఈ డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీలో భాగంగా నిర్మాణంలో ఉన్న వివిధ భవనాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో ప్రగతిలో ఉన్న అదనపు తరగతి గదుల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు.
ఈ సమీక్షలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాస రావు, జిల్లా విద్యాధికారి డి. రాధాకిషన్, సాంఘీక సంక్షేమ శాఖ ఈఈ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post