అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్


అభివృద్ధి పనులపై నివేదిక సిద్ధం చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి నవంబర్ 16:- జిల్లాలో వివిధ నిధుల కింద చేపట్టి ప్రారంభంకాని అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఎంఎఫ్టీ నిధులు, సీఎస్ఆర్ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో డిఎం ఎఫ్టి, సి.ఎస్.ఆర్, నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద చేపట్టి ఇప్పటివరకు ప్రారంభం కాని పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రిమోట్ తో కూడిన నివేదిక తయారు చేసి 10 ఈ రోజుల్లో అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వివిధ నిధుల కింద మంజూరు అయిన రోడ్డు నిర్మాణ పనులు, సామాగ్రి కొనుగోలు పూర్తి చేసిన పనులు డిసెంబర్ 5 లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా కలెక్టర్ అభివృద్ధి పనుల పురోగతి పై అధికారులతో చర్చించారు. గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు అందని అభివృద్ధి పనుల వివరాలు ప్రత్యేకంగా సేకరించి సంబంధిత ప్రజాప్రతినిధులకు కాపి అందించాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ముఖ్య ప్రణాళికాధికారి రవీందర్ ఈఈ పంచాయతీరాజ్ మునిరాజ్, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Share This Post