అమరచింత, ఆత్మకూరు మండలంలోని నందిమల్ల, మస్తీపూర్, మొట్లంపల్లీ గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన. తేది:8.12.2021, వనపర్తి.

జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని డిసెంబర్ 31వ. తేదీ లోపు ప్రతి ఒక్కరూ, వైద్య సిబ్బంది సమన్వయంతో వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
బుధవారం అమరచింత మండలంలోని నందిమల్ల, మస్తీపూర్ గ్రామ పంచాయతీలలో, ఆత్మకూరు మండలంలోని మొట్లంపల్లీ గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్, పల్లె ప్రకృతి వనాలను జిల్లా అదనపు కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నుండి రక్షించుకొనుటకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని, అదేవిధంగా జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ లోపు రెండు లక్షల వ్యాక్సిన్ లక్ష్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్ పి టి సి.లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది సమన్వయంతో 100 శాతము వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆయన సూచించారు.
పల్లె ప్రకృతి వనంలో చేపట్టిన పనులు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. పల్లె ప్రకృతి వనంలోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు వేరు చేయటం, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం వంటి పనులు పట్టాలని ఆయన తెలిపారు. పనులు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని ఆయన సూచించారు. నర్సరీ పనులు పూర్తిచేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని, నర్సరీని ఆకర్షణీయంగా తయారు చేయాలని ఆయన వివరించారు. నర్సరీ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆయన తెలిపారు.
ఆత్మకూరు మండలం మొట్లంపల్లి గ్రామపంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం కొరకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి పి ఓ. సురేష్ కుమార్, ఆత్మకూర్ మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎమ్మార్వో, ఎంపీడీవో, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post