అమిస్తాపూర్ వద్ద ఉన్న సారిక టౌన్షిప్, అలాగే పోతులమడుగు టౌన్షిప్లలో ఓపెన్ ప్లాట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రూపొందించిన లే-అవుట్లని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అన్నారు.
పోతులమడుగు, సారిక టౌన్ షిప్ ల లోని ఓపెన్ ప్లాట్లకు ఈనెల 16 నుంచి 18 వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాదం రామస్వామి ఆడిటోరియంలో నిర్వహించనున్న బహిరంగ వేలం సందర్భంగా అవగాహన నిమిత్తం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రి బిడ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సారిక టౌన్షిప్ తో పాటు, పోతులమడుగు టౌన్షిప్ లోని ప్లాట్లను తాను స్వయంగా సందర్శించడం జరిగిందని ,ఈ రెండు టౌన్షిప్ లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు, కలెక్టర్ కార్యాలయానికి, నేషనల్ హైవే కి దగ్గరగా ఉన్నాయని ,అదేవిధంగా ధర కూడా అందరికీ ఆమోదయ యోగ్యాంగా ఉందని అన్నారు. ఐదేళ్లలో ఈ ఫ్లాట్ల విలువలు సగానికి సగం పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రైవేటు ఫ్లాట్లు, లే-ఔట్లలో తీసుకున్నట్లయితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని, ఈ రెండు లే అవుట్లు పూర్తిగా ప్రభుత్వమే చేస్తున్నందున ఎలాంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదని, ఈ ప్లాట్ లపై ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే ప్రభుత్వమే వాటి బాధ్యత తీసుకుంటుందని,తెలిపారు.ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు,వ్యాపారులు బాగా ఆలోచించి ఈ ప్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈనెల 11, 12 తేదీలలో సెలవులు ఉన్నందున ప్లాట్లు తీసుకోవాలనుకునే వారు స్వయంగా సందర్శించవచ్చు అని ఆయన వెల్లడించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు సారిక టౌన్షిప్ ,పోతుల మడుగు టౌన్ షిప్ ప్లాట్ల గురించి వివరించారు
గృహ నిర్మాణ శాఖ ఈ ఈ , వైద్యం భాస్కర్ ఎల్డీఎం భాస్కర్లు రెండు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ ల కొలతలు ,లే-అవుట్ రహదారులు, ఇతర వసతులు, బ్యాంకు రుణం, వడ్డీ తదితర వివరాలను వెల్లడించారు.
కాగా అమిస్తాపూర్ లోని సారిక టౌన్ షిప్ లో ఉన్న 96 ప్లాట్ లకు మార్చి 17, 18 తేదీలలో మహబూబ్ నగర్ లోని బాదం సరోజిని ఆడిటోరియంలో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్లాట్లు 60 చదరపు గజాలు మొదలుకొని, 266 చదరపు గజాల వరకు ఉన్నాయి. వీటికి కనీస ధర 7 వేల రూపాయలు మరియు 8 వేల రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు.
పోతులమడుగులో ఉన్న 160 ఓపెన్ ప్లాట్ లకు మార్చ్ 16, 17, 18 తేదీలలో మహబూబ్ నగర్ లోని బాదం సరోజిని ఆడిటోరియంలో బహిరంగ వేలం నిర్వహించనున్నారు. పోతులమడుగు టౌన్షిప్ లో ఉన్న ప్లాట్లు 140 చదరపు గజాలు మొదలుకొని 400 చదరపు గజాలు వరకు ఉన్నాయని, వీటికి కనీస ధర 5500 మరియు 6000 రూపాయల వరకు నిర్ణయించారు.
ఈ ప్లాట్ లకు నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనేవారు ధరావత్తు కింద 10000/- రూపాయలు చెల్లించాలని కలెక్టర్ తెలిపారు.ఈ లే -అవుట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించి, అనుమతించిన లే-అవుట్లని ,ఎలాంటి చిక్కులు గాని, వివాదాలు కానీ లేవని, వెంటనే ఈ ప్లాట్లలో నిర్మాణాలను కూడా చేపట్టేందుకు నివాసము మరియు బహుళ ప్రయోజనాలు ఉన్న ప్లాట్ లని వారు తెలిపారు. అదే విధంగా భూమికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కూడా లేదని, ముఖ్యమైన ప్రాంతాలలో ఈ ప్లాట్లు ఉన్నాయని, అన్ని వసతులతో ,అంతర్గత రహదారుల నిర్మాణం, వీధి దీపాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రణాళిక బద్ధంగా ఈ లే-ఔట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని తెలిపారు.
అన్ని వివరాలతో పాటు, సైటుకు సంబంధించిన వివరాల బ్రోచర్లను ప్రి బిడ్ సమావేశంలో పొందవచ్చని,అంతేకాక వెబ్ సైట్ https://mahabubnagar.telangana.gov.in కానీ లేదా unda.gov.in./auctions/ tsiic.telangana.gov.in లేదా swagruha.telangana.gov.in లో పొందవచ్చు అని వారు వెల్లడించారు.
అలాగే ఫోన్ నంబర్లు 08542-241165,7675075365 లేదా 7993455775 కు సంప్రదించవచ్చని తెలిపారు.
____________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచారం శాఖ మహబూబ్ నగర్*
ఈ సమావేశంలో జిల్లా అధికారులతో పాటు సిబ్బంది ,ప్రైవేటు వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.