అయిజ మున్సిపాలిటి లో ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు లేకుండా , పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అయిజ మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                 తేది: 13-10-2021

అయిజ మున్సిపాలిటి లో ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు లేకుండా , పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అయిజ మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు అయిజ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమీషనర్, వైస్ చైర్మన్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో పట్టణ అభివృద్ధి పై  కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి పనులు, రోడ్డు పనులు, ఇతర పనులు ఏవి కూడా పెండింగ్ ఉంచకుండా త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. కాంట్రాక్టర్ల వెంటే  ఉండి  పట్టణ ప్రకృతి వనాల పనులు 10 రోజులలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అన్నారు. వైకుంఠఃదామం పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని అన్నారు. పట్టణ అభివృద్ధి కొరకు చేపట్టిన నిర్మాణాలను ఒక్కొకటి గా ప్రతి రెండు వారాలకు ప్రారంభోత్సవం చేస్తే పట్టణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని  ప్రజలకు కూడా తెలుస్తుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పనులను మీ స్థాయి లో ప్రతి వారం రివ్యూ చేయాలనీ, హరిత హారం టార్గెట్ ప్రకారం మొక్కలు నాటడం పూర్తి చేయాలనీ, రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలనీ , గద్వాల్ నుంచి అయిజ మెయిన్ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. రోడ్డు మ్యాప్ చెక్ చేసుకొని , రింగులు వేసిన తరవాతే రోడ్డు వేసేలా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ఎక్కడయినా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకొని పనులు ప్రారంభించాలని అన్నారు. రోడ్డు పనులతో పాటు ఇతర ఇంజనీరింగ్  పనులు కూడా పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణం లో ఎక్కడ కూడా చెత్త ఉంచకుండా , ఎపట్టికప్పుడు శానిటేషన్ చేయించాలని అన్నారు. శానిటేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 20 వార్డులకు సరిపడే సిబ్బంది ని ఏర్పాటు చేసుకొని, ట్రాక్టర్లను, ఆటో లను ఏర్పాటు చేసి ప్రతి రోజు ఇంటి ఇంటికి వెళ్లి చెత్త సేకరించాలని అన్నారు. ప్రజలు ఎవరు కూడా చెత్త బయట వేయకుండా చూసుకోవాలని అన్నారు. శానిటేషన్ సిబ్బంది ని పెంచుకోవడానికి ప్రపోసల్స్  పెట్టి, లేబర్ ను పెంచేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

పట్టణం లో పాత ఇండ్లు మొత్తం  ఎన్ని ఉన్నాయి,  లిస్టు తయారు చేసి, వారికి నోటీసులు ఇచ్చి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వారిని వెంటనే ఖాళీ చేయించాలని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టెలా ప్రజలను ప్రోత్సహించి, 95% ట్యాక్స్  వసూలు చేసేలా చూడాలని అన్నారు. రేసిడేన్షియాల్, కమర్షియల్ ప్రాపర్టీ లను క్లియర్ గా రికార్డ్స్ లో చూపించాలని అన్నారు. అనుమతి లేని నిర్మాణాలను మొదటి స్థాయి లోనే గుర్తించి , వాటిని ఆపేయాలని అన్నారు. ఎక్కడ కూడా అక్రమ నిర్మాణాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ ట్యాప్ కనెక్షన్లను ఎన్ని ఇళ్లకు ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 8500 ఇండ్లు ఉంటే 2000 ట్యాప్ కనెక్షన్స్(connections) ఇచ్చారని, మిగతా వాటిని పూర్తి చేయాలనీ అన్నారు.  రెవిన్యూ సిబ్బంది ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఆఫీస్ స్టాఫ్ కు బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలనీ  అన్నారు.  ఇంటింటికి తిరిగి చెక్ చేసి, వాక్సిన్ వేసుకొని వారికి వాక్సిన్ వేయించి, టార్గెట్ ను పూర్తి చేయాలనీ అన్నారు. సిజనల్ వ్యాధులు ప్రబలకుండా స్ప్రే చేయించాలని ఆదేశించారు.

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, , మున్సిపల్ చైర్మన్ దేవన్న, మున్సిపల్ కమీషనర్ నర్సయ్య, వైస్ చైర్మన్ నర్సింహులు, ఇ.ఇ. విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

Share This Post