అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఉచిత శిక్షణ తరగతులకు హాజరైన మంత్రి కేటీఆర్

అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఉచిత శిక్షణ తరగతులకు హాజరైన మంత్రి కేటీఆర్

*ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసితో ప్రయత్నం చేయాలి…..

*రాకపోయినా మన కాళ్ళపై మనం నిలబడే విధంగా తయారు కావాలి…

*వర్కింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్ పై దృష్టి పెట్టాలి….*

*ఉద్యోగ సాధనలో సెల్ఫ్ కాంఫిడెన్స్ చాలా ముఖ్యం..

*మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం….*

  • *అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఉచిత శిక్షణ తరగతులకు హాజరైన మంత్రి కేటీఆర్….

మనపై మనకు నమ్మకం ఉంటే సాధించలేనిది ఏది లేదని టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు అన్నారు. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా మామునూర్ విమానాశ్రయాన్ని పరిశీలించిన అనంతరం మామునూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసి ప్రతీ ఒక్క విద్యార్థిలో ఉండాలని అన్నారు. అయితే అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా పరిశ్రమికవేత్తలుగా ఎదిగేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యాపారం చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని మన కాళ్ళ మీద మనం నిలబడి మన కుటుంబాన్ని పోషించుకోగలిగితే చాలని తెలిపారు. దానికోసం వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చే యువతను ప్రోత్సాహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టెక్స్ టైల్ రంగంలో ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయని మరిన్ని రానున్నాయని అన్నారు. త్వరలోనే వరంగల్ నగరానికి మరిన్ని ఐటి కంపెనీలు రాబోతున్నాయని ప్రకటించారు. ఉద్యోగం సాధించాలంటే విద్యార్థులు ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు వర్కింగ్ స్కిల్స్ పై దృషి పెట్టాలని తెలిపారు. దింతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండాలని సూచించారు. అనంతరం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ మొబైల్ ఆప్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, *తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు,* ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు, మేయర్ గుండు సుధారాణి గారు, అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ గారు తదితరులు పాల్గొన్నారు.     

Share This Post