అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 30, 2021ఆదిలాబాదు:-

ప్రజల సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున వివిధ సమస్యలపై జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వారి సమస్యలపై అర్జీలు కలెక్టర్ కు సమర్పించారు. అర్జీదారులు సమర్పించిన వాటిని పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరిస్తామని, తన పరిధిలో లేని సమస్యలకు పరిస్కారం కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని, భూముల సమస్యలు పరిష్కరించాలని, రైతుబంధు రావడం లేదని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆర్థిక సహాయం అందించాలని, తదితర సమస్యలపై ఆర్జీలను కలెక్టర్ కు సమర్పించారు. 57 సంవత్సరాలు దాటిన వారు   వృద్దాప్యపు పింఛన్లు కొరకు మీ సేవ కేంద్రాల నుండి దరఖాస్తులను సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post