అర్జీలను పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్.

ప్రచురణార్ధం

అర్జీలను పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-23:

జిల్లా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుటకు కోరుతూ సమర్పించిన ధరఖాస్తులను  క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  సోమవారం ప్రగతి సమావేశ మందిరంలో  ప్రజల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించి సమస్యను  పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. 
అమనగర్ గ్రామ రైతులు దరఖాస్తు సమర్పిస్తూ నందులకుంట క్రింద నీటి అలుగు, గుండాల గడ్ తండా రోడ్డు మార్గంలో ఉన్న చిన్న మోరి వలనచిన్నపాటి వర్షానికి కూడా కనీసం పది రోజుల పైన నీరు నిలిచి మా పంట పొలాల్లో పైర్లు మునిగి కుల్లి పోతున్నాయని, ఇలా రెండు సంవత్సరాల పాటు మాకు పంట నష్టం జరిగిందని, MRO కు ఈ విషయమై వీడియోలు కూడా తీసి ఇచ్చామని, పెద్ద మోరిని మంజూరు చేయాలనీ కోరారు.
మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోతు రాము పాత రేషన్ కార్డు పై 35 కేజీల బియ్యం వచ్చేదని, ఇప్పుడు 18 కేజీల రేషన్ ఇస్తున్నారని, బియ్యం సరిపోవడం లేదని పాత రేషన్ కార్డు పై ముప్పై ఐదు కేజీల ఇప్పించాలని కోరారు.
గూడూరు మండలం అయోధ్యాపురం గ్రామ రైతులు బొల్లేపల్లి శివారు లో 1958 సంవత్సరంలో 48 ఎకరములు 10 మంది రైతులు కలిసి కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తున్నామని వ్యవసాయ భూములకు పట్టాలు లేవని వెంటనే పట్టాలు ఇప్పించాలని కోరారు.

కురవి మండలం బలపాల లింగ్య తండా శివారు కు చెందిన మాలోతు కిషన్ ఉపాధి హామీ పని కింద చేసిన పనికి డబ్బులు పోస్ట్ ఆఫీస్ అధికారుల ఇవ్వడం లేదని డబ్బులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.

మహబూబాబాద్ మండలము కొమ్ముగూడెం తండా కు చెందిన రాము ROFR పట్టా భూమి తండ్రి పేరు మీద పాస్ బుక్ ఉన్నదనీ కానీ ఆన్లైన్ లో నమోదు కానందున, ఆన్లైన్ లో పట్టా పాస్ బుక్ సర్వే నెంబరు నమోదు చేసి తన పేరున మార్చాలని  కోరారు.

నర్సింహులపేట మండలం పెద్ద నాగారం గ్రామం వస్తాం తండాకు చెందిన జాటోతు తావుర్య తనకు గల మూడెకరాల ఐదు గంటల వ్యవసాయ భూమినీ దౌర్జన్యంగా ఆక్రమించుకుని పొలాన్ని దున్ని నాట్లు వేస్తున్నారని వారిపై చర్య తీసుకొని న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post