అర్జీలను వెంటనే పరిష్కరించాలి….

అర్జీలను వెంటనే పరిష్కరించాలి….

మహబూబాబాద్, 2021 నవంబర్-01:

గ్రీవెన్స్ లో సమర్పించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, సదరు సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు భూ సంబంధ సమస్యల పై, పింఛన్లు మంజూరు కొరకు, పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇప్పించాలని, జీవనోపాధి కల్పించాలని, ఇళ్లు మంజురు చేయాలని కొరుతూ దరఖాస్తులు సమర్పించారు.

దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన సతీష్ తను చిన్నప్పటి నుండి వినికిడి సమస్యతో బాధపడుతున్నానని, సదరం సర్టిఫికేట్ తీసుకొని వికలాంగుల పించన్ కొరకు గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నప్పటికి పించను మంజూరు కాలేదని, జీవనోపాథి కొరకు వికలాంగుల కార్పోరేషన్ లోన్, డబుల్ బెడ్రూం కొరకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు లోను, వికలాంగుల పించన్ మంజూరు కాలేదని తెలిపారు.

మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామ నివాసి షేక్ జబ్బార్ మియా తను 1984 నుండి 2020 వరకు పోలీస్ శాఖలో 36 సంవత్సరాలు హోంగార్డుగ పనిచేసి రిటైర్ అయ్యానని, నెలవారి పెన్షన్ సౌకర్యం లేనందున, అతిపేద కుటుంబానికి చెందిన తనకు అవుట్ సోర్స్ ద్వారా ఉపాధి కల్పించాలని కోరారు.

పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామ నివాసి ఆలేటి రమేష్ అవుతాపురం గ్రామ శివారులో సర్వే నెంబర్ 105, 168 లో ఉన్న మూడెకరాల 20 గుంటల వ్యవసాయ భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ఉండి నేటికి కాస్తులోను, కబ్జాలోను ఉండి సాగు చేసుకుంటున్న తన భూమిని రెవెన్యూ అధికారులు తనకు తెలియకుండా తన పేరు మీద నుండి తొలగించారని, తన పేరును  రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి పాస్ పుస్తకము, 1బి రికార్డు  ఇప్పించలని కోరారు.

కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ నివాసి మాధవపెద్ది రాంచంద్రారెడ్డి సర్వేనెంబర్ 378 లో గల భూమిని గత 20 సంవత్సరలుగ ఖాస్తు చేస్తున్నానని, 2002 నుండి 2014 వరకు శిస్తు కూడా చెల్లించి రశీదులు కలిగి ఉన్నానని, పట్టాదార్ పాస్ పుస్తకం లేనందున ఇప్పించలని కోరారు.

దంతాలపల్లికి చెందిన ఎర్రమల్ల వీరయ్య తన చిన్న కూతురుకు వివాహం చేసిన అనంతరం అల్లుడు, వారి తల్లిదండ్రులు తన కూతురు బతికి ఉన్నంత కాలం అదనపు కట్నం కొరకు వేధించడం జరిగిందని, కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా తన బిడ్డ మరణానికి కారణమైన అల్లుడిని, పెఌ సమయంలో ఇచ్చిన 60 తులాల బంగారు ఆభరణములు, 5 లక్షల నగదు, కిలో వెండి అభరణములు కాజేసిన అల్లుడిని, అతని తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

చిన్న గూడూరు కు చెందిన వడ్లకొండ సత్తెమ్మ 75 ఏళ్ళ వయస్సు ఉన్న తనకు ఎవరూ లేరని, తనకు గల ఇళ్ళు పూర్తిగా కూలిపోయె స్థితిలో ఉన్నదని, తనకు ఇళ్ళు మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post