అర్జీలను వెంటనే పరిష్కరించాలి…..

ప్రచురణార్థం

అర్జీలను వెంటనే పరిష్కరించాలి…..

మహబూబాబాద్, 2021 నవంబర్-08:

ప్రజలు సమర్పించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. కొమరయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. కొమరయ్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ప్రజల అర్జీలను  పెండింగ్ లో ఉంచకుండా వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కొరకు దరఖాస్తు  ఏ దశలో పెండింగ్ లో ఉన్నది, అలాగే తిరస్కరించబడిన అర్జీల పై అర్జిదారులకు తెలిపి అట్టి అంశంపై అర్జిదారులు మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు సమర్పించకుండా చూడాలన్నారు.

మహబూబాబాద్ మూడు కొట్ల దగ్గర శనగపురం రోడ్డు వద్ద నివస్తిస్తున్న యాకుబ్ బీ తన ఇంటి ముందు డ్రైనేజీ కాల్వ కొరకు నాలుగు నెలల క్రితం గుంతలు త్రవ్వి అసంపూర్తిగా వదిలి వేసారని, అవతలి ప్రక్క నుండి పూర్తి చేసి తన ఇంటి ముందు వదిలివేయడం వలన మురుగు నీరు తన ఇంటి ముందుకు వచ్చి నిల్వ ఉంటున్నాయని, బయటకు రాలేక పోవుచున్నానని, వెంటనే డ్రైనేజీని కాల్వను పూర్తి చేయాలని కోరారు.

కేసముద్రం మండలం ధనసరి గ్రామానికి చెందిన 80 సంవత్సరాల శివరాత్రి బాలమ్మ తనకు 25 సంవత్సరాల క్రితం స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన సర్వే నెంబర్-154 లో భూమి ఇచ్చి ఇప్పటి వరకు పట్టాదార్ పాస్ పుస్తకం ఇవ్వలేదని, పట్టాదార్ పుస్తకం ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ జిల్లా భారత విద్యార్థి ఫెడరేషన్  విద్యార్ధులు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని, కెజిబివి మోడల్ స్కూల్స్ నందు టీచర్లను, అధ్యాపకులను నియమించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

మరిపెడ మండలం తండా ధర్మారం కు చెందిన గుగులోతు ఉన్నతనకు 4-16 గుంటల భూమి ధరణి రాకముందు పట్టా అయి, గ్రీన్ పాస్ బుక్ రాలేదని, రైతు బందు వచ్చేదని, బ్యాంక్ లోన్ కొరకు వెఌతే గ్రీన్ పాస్ బుక్ తీసుకొని రమ్మంటున్నారని, ఖాత నెంబర్ మారడంతో గ్రీన్ పాస్ బుక్ రాలేదని,  ప్రస్తుతం ధరణి సైట్ లో మా యొక్క భూమి ప్రొహిబిటెడ్ జాబితలో ఉండడంతో డిఎస్ పెండింగ్ లో ఉండి సమస్య పరిష్కారం కావడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన లింగయ్య తనకు ఎకరం 30 గుంటల వ్యవసాయ సాగు భూమి ఉండగా, ఎకరం 22 గుంటలకు రైతుబంధు వస్తున్నదని, మిగతా ఎనిమిది గుంటలకు రైతు బంధు రావడం లేదని, మొత్తం ఎకరం 30 గుంట లకు రైతు బంధు ఇప్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post