అర్జీలను సత్వరమే పరిష్కరించాలి …..

ప్రచురణార్థం

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి …..

మహబూబాబాద్, మే -09:

అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 23,871 అర్జీలు రాగా, 23,204 పరిష్కరించామని, 667 దరఖాస్తులు ఇంకను పెండింగ్ లో ఉన్నాయని, అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని, అర్జీలలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని, సమగ్రంగా విచారణ చేసి అర్హులైన, ఫిజికల్ గా పొజిషన్ లో ఉన్న వారికి పట్టాలు జారీ చేయాలని, వేరే వారికి పట్టాలు జారీ చేయరాదని తెలిపారు. ధరణి లో కొత్త మాడ్యుల్స్ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వచ్చిన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యని పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని తెలిపారు.

ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో (51) దరఖాస్తులు వచ్చాయి. అంతకుముందు అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో (06) దరఖాస్తులు అందాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post