అర్జీలను సత్వరమే పరిష్కరించాలి … జిల్లా కలెక్టర్ కె. శశాంక.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి … జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి … జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -30:

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను వెంటనే పరిష్కరించాలని, మళ్ళీ మళ్ళీ అదే సమస్య పై ప్రజలు ప్రజావాణి లో వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, ఆలస్యం చేయకుండా వెంటనే అర్జీలను పరిష్కరించాలని, పరిష్కార దశలో ఉంటే వివరిస్తూ అర్జీ దారునికు సమాచారం అందించాలని సూచించారు.

కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామస్తులు దరఖాస్తు సమర్పిస్తూ గత పల్లె ప్రగతి కార్యక్రమం లో కొత్త కరెంటు స్తంభాలను వేసి పాతవాటిని తొలగించ లేదని ప్రమాదకరంగా ఉన్నందున వెంటనే తొలగించాలని, అలాగే గ్రామంలో లో ఓల్టేజ్ సమస్య వలన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ మంజూరు అయిన ఇంకా ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేసి లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని కోరారు.

మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన బొక్క వెంకట్ రామ్ నర్సయ్య సర్వే నెంబరు 195/బి/1, 195/బి/2 లోని తన వ్యవసాయ భూమిని రంగ సాయి పేట గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమంగా వారి పేరున పట్టా చేసుకున్నారని, ఇట్టి భూమిలో తను కాస్తు లో ఉన్నానని, సమగ్ర విచారణ జరిపించి కాస్తులో ఉన్న తనకు పట్టాదారు పాస్ బుక్ ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం బ్రాహ్మణ పల్లి కి చెందిన రైతులు తమ గ్రామంలో మిషన్ కాకతీయ లో భాగంగా పెద్ద కట్ట ఆనకట్టు కాలువ మరమ్మత్తులకు సుమారు 6 కోట్ల రూపాయలు మంజూరు అయి ఐదు సంవత్సరాలు పూర్తయిన ను 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని, ఇట్టి కాంట్రాక్టర్ పై చట్టరీత్య చర్య తీసుకొని మరల రి టెండర్ పిలిచి పనులు పూర్తి చేయించాలని కోరారు.

మరిపెడ మండలం ఇస్లావత్ తండా అనే పురం కు చెందిన జాటోత్ కుమార్ 2018 ఆగస్టులో కరెంట్ షాక్ తగిలి కాళ్లు చేతులు పని చేయడం లేదని, వెన్నెముక శస్త్ర చికిత్స కొరకు 10 లక్షలు ఖర్చుపెట్టినను అవయవాలు సక్రమంగా పనిచేయడం లేదని వ్యక్తిగత పనుల పై ఇతరులపై ఆధారపడి ఉంటున్నానని, తనకు వికలాంగుల కోటాలో పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (61) వినతులు అందాయి.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకట రమణ, పర్యవేక్షకులు అనురాధ, పుల్లా రావు, పున్నం చందర్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post