అర్జీలు వెంటనే పరిష్కరించాలి …. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్.

అర్జీలు వెంటనే పరిష్కరించాలి …. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్.

ప్రచురణార్థం

అర్జీలు వెంటనే పరిష్కరించాలి …. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్.

మహబూబాబాద్, మే -02:

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అందజేసిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రగతి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అర్జీలను పెండింగ్ లో ఉంచరాదనీ, వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (61) దరఖాస్తులు వచ్చాయి.

గూడూరు మండలం ఎవూరు గ్రామానికి చెందిన వి. నరహరి కన్ను పనిచేయనందున సదరం సర్టిఫికేట్ ఇప్పించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

గంగారాం మండలం పూనుగొండ్లు గ్రామానికి చెందిన సోలం పద్మ తన భర్త గుండెపోటుతో మరనించిన తర్వాత ధరణి సెక్షన్ వారు వారి పేరున ఉన్న భూమికి చెందిన పాస్ బుక్ ను తీసుకొని తనకు తిరిగి అందజేయడం లేదని, ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ మండలం ఈదుల పూసపల్లి గ్రామానికి చెందిన వెన్న లక్ష్మా రెడ్డి తనకు ఆఫ్ లైన్ లో వ్రాతపూర్వక జనన ధృవీకరణ పత్రం ఇచ్చారని, కంప్యూటర్ పత్రం ఇప్పించాలని కోరారు.

ఈ ప్రజావాణిలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి వెంకట రమణ, పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయము, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post