అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ఈ రోజు ప్రజావాణిలో (54) దరఖాస్తులు

—————————–
పెద్దపల్లి, జనవరి -30:
—————————–
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి. లక్ష్మీనారాయణతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో ( 54 ) అర్జీలు రాగా, అందులో (38 ) రెవెన్యూ సంబంధితమైనవి కాగా, మిగతా ( 16 ) అర్జీలు మిగిలిన శాఖలకు సంబంధించినవి వచ్చాయి.

పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన పిడుగు మధునమ్మ తనకు వితంతువు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఎంపిడిఒ పెద్దపల్లి గారికి రాస్తూ అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

గోదావరిఖని పట్టణం గాంధీనగర్ కు చెందిన కల్వల జగన్ తనకు పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో తమ పేర్ల మీద ఉన్న భూమి కల్వల రాజేశం తమకు తెలియకుండా తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా అతని పేరు పహణిలో నమోదు చేయడం జరిగిందని, వాటిని రద్దు చేసి తగిన న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పెద్దపల్లి తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ ఉద్యోగులతో కలిసి అమరవీరుల దినోత్సవం సందర్భంగా
అమరవీరుల గౌరవార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post