అర్జీ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి. ఎక్కువగా భూ సమస్యల దరఖాస్తులు. :: అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

అర్జీదారులు  పలు సమస్యలపై ప్రజావాణిలో  అందించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ యస్. మోహన్ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.  సోమవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రజావాణి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలిం చి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో ఎక్కువగా భూసమస్యల దరఖాస్తులు అందాయని  తెలుపుతూ  భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు 19, వివిధ శాఖలకు సంబంధించి 37 మొత్తం 56 దరఖాస్తులు అందాయని అన్నారు.
    ఈ సమావేశంలో   ఈ. డి. యస్.సి. కార్పొరేషన్ శిరీష, పి.డి. సంక్షేమ అధికారులు  జ్యోతి పద్మ, శంకర్, డి.యస్.ఓ విజయ లక్ష్మి, పర్యవేక్షకులు  పులి సైదులు,  వివిధ శాఖల అధికారులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

అర్జీ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించండి.
ఎక్కువగా భూ సమస్యల దరఖాస్తులు.
అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

Share This Post