అర్జులైన ప్రతి దండారికి 10 వేల రూపాయలు : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి 10 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లాలోని ఆదివాసీ భవన్‌లో 24వ కుంరం సూరు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన దండారి ఉత్సవాలను ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసననభ్యులు ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి దండారికి 10 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని, ఆదివాసీలు వారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించి అభివృద్ధి చెందేలా ముందుకు సాగాలని, ఆదివాసీల అభ్యున్నతి, అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలలో పోషణ లోపం లేకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి అవసరమైన వైద్య చికిత్సలు, మందులు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన శాఖ అధికారిణి మణెమ్మ, కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, వివిధ
సంఘాల నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post