అర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం-1
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 29: సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ లో చేపడుతున్న అర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా తగిన చర్యలు చేపట్టాలని టీఎస్ఎంఐడీసీ సిబ్బందిని ఆదేశించారు. కావాల్సిన మెషినరీ, పరికరాలు త్వరగా తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎలక్ట్రికల్ పనులు కొంత మినహా, మిగిలిన పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఇప్పటివరకు జిల్లా నుండి శాంపిల్స్ ను వాహనాల్లో హైదరాబాద్ కు పంపే వాళ్ళమని, ఆ రిపోర్ట్ మరుసటి రోజు వచ్చేదని, ఈ ల్యాబ్ ఏర్పాటు వలన ఇకనుండి మన జిల్లాలోనే స్థానికంగా ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు వీలుగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. మహేష్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, తహశీల్దార్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Post