అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే అటవీ భూమి హక్కుపత్రాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలి…

ప్రచురణార్ధం

అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే అటవీ భూమి హక్కుపత్రాలు పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలి…

బయ్యారం, నవంబర్,01.

అటవీ భూములలో సాగుచేస్తున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు హక్కుపత్రాలు పొందేందుకు, దరఖాస్తు చేసుకునేలా అధికారులు, సిబ్బంది అవగహన పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

సోమవారం కలెక్టర్ బయ్యారం మండలంలో పర్యటించి ఎంపిడిఓ కార్యాలయంలో అటవీ భూముల హక్కు చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతోకాలంగా సాగు చేస్తున్న రైతులకు అటవీ భూములపై అర్హుత మేరకు హక్కు కల్పించాల్సిన అవసరమున్నందున, ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కు పత్రం పొందేందుకు కావల్సిన పత్రాలతో రైతు దరఖాస్తు చేసుకునేలా అధికారులు సహకరించాలన్నారు.

అందుకు చేపడుతున్న దరఖాస్తు విధానంపై ముందుగా అధికారులు అవగాహన పొంది సిబ్బందికి కూడా అవగాహన కల్పించాలన్నారు.

అధికారులు సిబ్బంది 58 గ్రామాల లో అటవిభూముల హక్కుపత్రాలకై దరఖాస్తు చేసుకునే రైతులతో ముందస్తుగా 19 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి తొలుత గుర్తించాలన్నారు. గుర్తించిన రైతుల క్షేత్రాలను సందర్శించేందుకు నోటీస్ ఇవ్వాలని, ఇచ్చిన తేదీ ప్రకారం అధికారులు సిబ్బంది కలిసి రైతులతో పర్యవేక్షణ చేపట్టి నిర్దారించుకున్న తర్వాత దరఖాస్తు చేయించాలని, అందుకు కావలసిన పత్రాలను సమకూర్చుకునేందుకు అధికారులు తోడ్పాటు అందించాలన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి,జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, ఎంపిడిఓ చలపతిరావు, తహసీల్దార్ నాగ భవాని, ఎఫ్.ఆర్.ఓ.సువర్చల, ఎంపిఓ పద్మ, పంచాయతీ సెక్రటరీ లు, వి.ఆర్.ఏ.లు తదితరులు పాల్గొన్నారు.
——————————-+
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం,మహబూబాబాద్ వారిచే జారీచేయనైనది.

Share This Post