అర్హత గల ప్రతి ఒక్కరి నమోదుతో పాటు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి – పరిశీలకులు విజయ్ కుమార్

 

2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు తప్పులేని జాబితా సిద్ధం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ ఎస్ ఆర్ (special summary revision) పరిశీలకులు విజయ్ కుమార్ తెలిపారు.

ఓటర్లుగా ప్రత్యేక నమోదు కార్యక్రమం పరిశీలనలో భాగంగా ఆయన మన జిల్లాలో పర్యటించారు. బీచ్ పల్లి మండలంలోని గ్రామాలలో పేర్లు నమోదు చేసుకున్న దరఖాస్తుదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్, ఆర్ డి వో లతో తహసిల్దార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1 జనవరి 2022 సంవత్సరం వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించుటకు బి ఎల్ వో ల నుండి ఇ జిల్లా అధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కొత్తగా నమోదుకు ఫారం 6 తో పాటు పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గం మార్పులకు ఫారం 7, 8 ద్వారా సంబంధిత ప్రజల దరఖాస్తులు తీసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా ఎటువంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి శ్రద్ధ చూపాలని అధికారులను కోరారు.
అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1-11-2021 న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు ప్రచురించడం జరిగిందని, క్లెయిమ్స్ తీసుకోవడానికి ఈ నెల 6, 7 తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, తిరిగి 27, 28 తేదీలలో కూడా నిర్వహిస్తున్నామని, క్లెయిమ్స్ కోసం వచ్చే దరఖాస్తులను బి ఎల్ వో లు పరిశీలించి జాబితాలో సరైన వివరాల నమోదుకు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

 

 

Share This Post