అర్హత గల ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందాలి :  జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలను నమోదు చేసుకొని ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి. రాజేశంతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని, ప్రజాస్వామ్యంలో ఓటు ఆవశ్యకతను వివరించాలని, ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చే నవంబర్‌ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదుకు అర్హులని తెలిపారు. ఫోటో ఓటర్ల జాబితా సవరణ 2022లో భాగంగా రెండు సార్లు నమోదైన వారి ఓటర్ల తొలగింపు, పేరు, చిరునామా, ఇతరత్రా తప్పులు నవరణ లాంటి అంశాలను అక్టోబర్‌ ౩0 లోపు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేసి సరి చేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టి నవంబర్‌ 1 నాటికి డ్రాఫ్టు ఓటర్ల జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ప్రచురితం చేయడం జరుగుతుందని, నవంబర్‌ 31వ తేదీ వరకు తప్పులు సవరణకు అవకాశం ఉంటుందని, జనవరి 5, 2022 న తుది జాబితా నిద్ధం అవుతోందని తెలిపారు. ఇందుకు గాను ప్రతి రాజకీయ పార్టీ బూత్‌ స్థాయిలో ఒక కార్యకర్తను ఏర్పాటు చేసి నరైన ఓటర్ల జాబితా సిద్ధం అయ్యేందుకు, అధికారులకు రాజకీయ పార్టీ నాయకులు అన్ని విధాలా సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవికృష్ణ, మండలాల తహశిల్దార్లు, వివిధ పార్టీల నాయకులు
తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post