అర్హులందరికి ఆహారభద్రత కార్డుల పంపిణి :: జిల్లా కలెక్టర్ జి. రవి

అర్హులందరికి ఆహారభద్రత కార్డుల పంపిణి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం—-1                                                                                                                                                                                                                                           తేదిః 29-07-2021

అర్హులందరికి ఆహారభద్రత కార్డుల పంపిణి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జూలై 29: జిల్లాలో అర్హులందరికి ఆహారభద్రత కార్డుల పంపిణి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం ధర్మపురిలో ధర్మపురి మండలంలో చేపట్టిన ఆహార భద్రత కార్డుల పంపిణి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గోని లబ్దిదారులకు ఆహార భద్రత కార్డుల పంపిణి కార్డులను పంపిని చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన లబ్దిదారులను గుర్తించి, ఈనెలలోనె కార్డుల పంపిణి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సమక్షంలో పూర్తిచేసి, అగస్టు మొదటి వారం నుండి నిత్యావసర సరుకులు పంపిణి కూడా చేయాలని అధికారులును ఆదేశించడం జరిగిందని పేర్కోన్నారు. రేషన్ కార్డులను కేవలం రేషన్ సరుకుల కొరకు మాత్రమే కాకుండా, ఆదాయ దృవీకరణ, ఆరోగ్యశ్రీ, చిరునామా గుర్తింపుగా ఉపయోగపడుతుందని పేర్కోన్నారు. రేషన్ కార్డుల పంపిణి చేయడం ద్వారా కొత్తగా 7621 కుటుంబాలకు లబ్ది చేకురనున్నదని, ఈ రోజు ధర్మపురి మండలంలో 385 కార్డులను కొత్తగా పంపిణి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అన్ని అర్హుతలు ఉండి వివిధ కారణాల చేత ధరఖాస్తు చేసుకోలేని, తిరస్కరించబడిన వారు కొత్త రేషన్ కార్డులు పోందే అవకాశాన్ని తిరిగి ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని, ఆ విషయాన్ని పత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుందని పేర్కోన్నారు.

ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెల్లరేషన్ కార్డులు లేకపోయినప్పటికి ప్రతి ఒక్క సహాయాన్ని ప్రజలకు అందించం జరిగిందని అన్నారు. ఈ కార్డుల ద్వారా అన్ని పథకాలకు అర్హులమవుతారని, పేదల శ్రేయస్సుకు నిరంతరం కృషిచేస్తున్న ప్రభుత్వం తెలంగాణా మాత్రమే అని, కరోనా వల్ల ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపించినప్పటికి, పించన్ల పంపిణి, రైతుబందు వంటి కార్యక్రమాలను కొనసాగించడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో యంపిపి చిట్టిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సంగి సత్తెమ్మ, మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యెరి రాజేష్, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, ఎం.పి.పిలు, సర్పంచులు, తసీల్దార్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post