అర్హులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

అర్హులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

శనివారం రాజర్షి షా పుల్కల్ మండలము ఇసోజిపేట గ్రామ పంచాయతీ ప్రాథమిక పాటశాల లో ఏర్పాటుచేసిన కోవిడ్ వాక్సినేషన్ ను కేంద్రాన్ని సందర్శించారు. వ్యాక్సిన్ వేస్తున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు. వాక్సినేషన్ తీసుకోవడంకోసం కొద్ది మంది మాత్రమే వుండటంతో, పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ కార్యకర్త, ANM లను గ్రామములో ఇంటింటి కి తిరిగి వాక్సినేషన్ తీసుకోని వారిని గుర్తించి, కౌన్సిలింగ్ చేసి వాక్సినేషన్ తీసుకునేలా చైతన్య పర్చాలన్నారు.
గ్రామ పంచాయతీ పరిధి లో అర్హత గల వారందరికీ వాక్సినేషన్ ఇప్పించి వంద శాతం వాక్సినేషన్ పూర్తయిన గ్రామంగా ప్రకటించాలని కోరారు.

అనంతరము గ్రామ పంచాయతీ పరిధి లో ఇంటింటి సర్వే ను పరిశీలించి ఇంటిలో వున్న
ఐదుగురిలో ఒకరికి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు వున్నప్పటికీ వాక్సినేషన్ తీసుకున్న మాజీ సర్పంచ్ రామచంద్రా రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. పిమ్మట ఆ ఇంట్లో అందరూ వాక్సినేషన్ తీసుకున్నట్లు ఇంటి కి స్టికర్ అంటించారు.

గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరిగి వాక్సినేషన్ వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, మండల పంచాయతీ అధికారి మహేందర్ రెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.

Share This Post