అర్హులందరికీ పోడు భూములపై హక్కు పత్రాలు

 

జిల్లాలో పోడు భూములకు జారీ చేసేందుకు
డివిజనల్‌ స్థాయి కమిటీలు సిఫార్సు చేసిన
దరఖాస్తులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలోని జిల్లా కమిటీ బుధవారం కలెక్టరేట్ లో పరిశీలించింది.
అర్హులందరికీ పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.

సమావేశంలో జిల్లా కమిటీ సభ్యలు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అరుణా రాఘవ రెడ్డి, వీర్నపల్లి జెడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎల్లారెడ్డి పేట జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, DFO బాలమని, DTDO అంబాజి లతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఇంచార్జీ జిల్లా రెవెన్యూ అధికారి టి శ్రీనివాస్ రావు, ZP CEO గౌతమ్ రెడ్డి లు పాల్గొన్నారు.

 

Share This Post