అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*

ప్రచురణార్థం—-1
*అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*
*ఆగస్టు మాసం నుంచి నూతన రేషన్ కార్డుదారులకు రేషన్ అందజేత*
*జిల్లాలో 7286 నూతన రేషన్ కార్డులు మంజూరు*
*రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ చేయవద్దు*
ధర్మారం మండలంలోని ఖిలవనపర్తి గ్రామంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్*
పెద్దపల్లి జూలై 29:- అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. గురువారం ధర్మారం మండలంలోని ఖిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి నూతనంగా పెద్దపల్లి జిల్లాలో 7283 రేషన్ కార్డులను మంజూరు చేసామని తెలిపారు. ప్రస్తుతం ధర్మారం మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లోని 343 కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. *పెద్దపల్లి జిల్లాలో గతంలోనే 215000 రేషన్ కార్డుల ద్వారా 6.5 లక్షల మందికి రేషన్ అందిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలే ఉద్దేశంతో నూతనంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు* ఆగస్టు మాసం నుంచి నూతన రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ రేషన్ అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టి పారదర్శకంగా నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల వద్ద నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి లబ్దిదారులను ఎంపిక చేసామని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో పాల్గోన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం వేల కోట్ల వ్యయం చేసి రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతి మాసం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం రూ.1/- కిలో వ్యయం పై అందజేస్తున్నామని తెలిపారు. ఆగస్టు మాసం నుంచి నూతన రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం అందజేస్తామని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలు తప్పుడు మార్గం పట్టకుండా ఉండే విధంగా పటిష్టమైన నిఘా వ్యవస్థ రుపొందించి డీలర్ల వద్ద బియ్యం బ్లాక్ మార్కెటింగ్ కాకుండా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు.

అనంతరం ధర్మారం మండలంలోని 25 మంది కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులకు చెక్కులను కలెక్టర్ పంపిణీ చేసారు.

జిల్లా పౌరసరఫరాల అధికారి తోట వెంకటేశ్, ఆర్.డి.ఓ.శంకర్ కుమార్, తహసిల్దార్ వెంకటలక్ష్మీ, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చే జారీ చేయనైనది.

రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
రేషన్కకార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్

Share This Post