అర్హులైన ప్రతి ఒక్కరికి కోవిడ్19 వ్యాక్సినేషన్ అందిస్తాం:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-1

తేదీ.3.1.2022

అర్హులైన ప్రతి ఒక్కరికి కోవిడ్19 వ్యాక్సినేషన్ అందిస్తాం:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, జనవరి 3:- జిల్లాలో ఉన్న అర్హులందరికీ కరోనా వ్యాక్సినేషన్ అందజేస్తామని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. సోమవారం పట్టణంలో ఖిల్లా గడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగ శ్రావణి లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. జనవరి 3 నుండి దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి వ్యాక్సినేషన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 15 -18 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లల జనాభా సుమారు 60 వేల వరకు ఉంటుందని, వీరికి వ్యాక్సినేషన్ అందించేందుకు జిల్లాలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల పైబడిన జనాభా 100% మొదటి డోస్ వాక్సినేషన్, 67% రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, సకాలంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా జరుగుతుందని ,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. నూతన కరోనా వేరియంట్ వ్యాప్తి నియంత్రించడానికి ప్రభుత్వం జనవరి 10వ తేదీ వరకు ర్యాలీలు సమావేశాలు నిషేధించిందని దీనికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగ శ్రావణి లు స్వయంగా పిల్లలకు టీకాలు వేశారు.

ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ, వైద్యులు కౌన్సిలర్లలు,స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post