అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు…


జనగామ జనవరి 24.

జిల్లాలో అర్హులైన ప్రతి దళిత దళిత బంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఫీవర్ సర్వే దళిత బంధు పంట నష్టపరిహారం లపై జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జనగామ స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తాటికొండ రాజయ్య జిల్లా పరిషత్ చైర్మన్ సంపత్ రెడ్డి జనగామ మున్సిపల్ చైర్మన్ జమున జిల్లా అధికారులు తో సమీక్షించారు.

ముందుగా ఫీవర్ సర్వే పై మంత్రి మాట్లాడారు. డాక్టర్లు రోగులను పరామర్శించినప్పుడే మనోధైర్యం పెరుగుతుందన్నారు ఆశాలు ఏఎన్ఎంలు పంచాయతీ సెక్రటరీలు ప్రతిరోజు కరోనా సోకిన వారి లక్షణాలను అడిగి తెలుసుకోవాలని లక్షణాలకు తగినట్లుగా వైద్యం అందజేయాలన్నారు గతంలో ఇంటింటి సర్వే చేపట్టడం కోవిదు నియంత్రణ చర్యలు పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాఖ పనితీరును కొనియాడింది అన్నారు.

మేడారం జాతరకు భక్తుల రాకపోకలు పెరిగినందున కోవిద్ నియంత్రణకు టెస్టులు పెంచుతూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు ఇప్పటికే వివాహ వేడుకలు నియంత్రించామనీ, ధర్నా లు సభలు సమావేశాలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా మాస్క్ లేని వారికి జరిమానా విధిస్తూ విశ్వత ప్రచారం చేపట్టాలన్నారు వైద్యాధికారులు రెండవ డోసు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ప్రభుత్వ ఆస్పత్రులలో కోవిద్ నియంత్రణకు కావలసిన ఆక్సిజన్ మందులు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన సేవలందించే ఉద్యోగుల ఖాళీ లను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
దళిత బంధు పథకం సమాచారం ఇంటింటికి చేర్చాలన్నారు 1.50 లక్షల కోట్ల తో చేపట్టే ఈ దళిత బంధు పథకం అమలులో రాష్ట్రంలోనే జనగామ ను అగ్రస్థానంలో నిలపాలని అన్నారు ప్రతి నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. అర్హులైన దళితులు అందరికీ దళిత బంధు పథకం వర్తిస్తుందని తెలియజేయాలని అంచెలంచెలుగా విస్తరింప చేస్తామన్న సమాచారం వారికి తెలియజేయాలన్నారు. మూడు సంవత్సరాలలో దళిత బంధు పథకం ప్రతి ఒక్కరికి అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు
ఫిబ్రవరి 5వ తేదీ కల్లా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఎంతైనా ప్రతి లబ్దిదారునికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండలన్నారు.

ఎంపిక చేసిన వారికి సాంకేతిక పరంగా వ్యాపారాలలో శిక్షణ ఇవ్వాలని యూనిట్లు నెలకొల్పేందుకు ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా లబ్ధిదారుల ఆసక్తిగల పథకాలనే మంజూరు చేయాలన్నారు.

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో 64 వేల కుటుంబాలు ఉన్నాయని ప్రతి కుటుంబం తో జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్నారు తడిక బంధు పథకం అమలులో శిక్షణ కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించు కోవాలని ప్రతి యూనిట్ లో నైపుణ్యం పై శిక్షణ ఇస్తూ మార్గదర్శకాలు చేస్తూ వారి కుటుంబాలకు బాసటగా నిలవాలన్నారు.

స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య మాట్లాడుతూ మాణిక్యపురం నవాబుపేట వంటి గ్రామాలలో తక్కువ మంది ఉన్నందున ఆయా గ్రామాలను ఎంపిక చేయాలన్నారు సమగ్ర కుటుంబ సర్వే లో రిజిస్టర్ లో నమోదు చేయబడిన వివరాల ఆధారంగా జీవన స్థితిగతులను బట్టి పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు. పల్లె నిద్ర లో భాగంగా దళితవాడలో పర్యటించి వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేయడం జరిగిందన్నారు విద్యావంతులను ఎంపిక చేయగలిగితే దళిత బంధు పథకం మరింత ముందుకు పోతుందన్నారు లబ్ధిదారులు తమ యూనిట్లను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా నెలకొల్పు కోవచ్చు నన్నారు.

జనగామ నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ దళిత బంధు పథకం అమలులో ప్రాధాన్యతను కూడా గుర్తించాలని అంచెలంచెలుగా ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు యూనిట్లను మంజూరు చేయడమే కాకుండా వాటి పనితీరును కూడా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ చేయ లన్నారు.

జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య వివరిస్తూ ఫీవర్ సర్వే రోజువారి సమీక్షించడం జరుగుతుందని తెలియజేశారు పరిహారం పై నివేదికలు తెప్పించమని ప్రభుత్వానికి నివేదిస్తా మన్నారు దళిత బందు కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామని, నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను నియమించామని, ఐదో తేదీ లోపు అర్హులైన వారిని గుర్తించి samagra నివేదిక అందజేస్తామన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్, ఆర్ డి వో లు జిల్లా అధికారులు పాల్గొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది

Share This Post