అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్,

పత్రిక ప్రకటన

తేదీ : 02–09–2022,

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్,
స్వీప్ యాక్టివిటీ, ఓటు నమోదు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఈ విషయంలో ఓటర్లకు సంబంధించి వివరాలు తెలుసుకొనేందుకు స్వశక్తి మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు, ప్రతి అంగన్వాడీ కేంద్రం, ఆసుపత్రిలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపినారు.
@@@@@@
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులకు ఓటు హక్కు కల్పించాలి,
జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్,

అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. ఓటర్ జాబితా – ఆధార్ అనుసంధానంపై జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎలక్ట్రోరియల్ రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వో), మండలాల తహశీల్దార్లు, బూత్ లెవల్ ఆఫీసర్లతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితాకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. అలాగే ఆయా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ తిరిగి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని త్వరగా పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు తెలుసుకొంటూ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు 6–బీ ఫారాలలో దరఖాస్తుదారులు ఆధార్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వశక్తి మహిళా సంఘాలతో బూత్ లెవెల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సమావేశాలు ప్రారంభించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి బూత్ కవర్ అయ్యేలా స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ వివరించారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు జిల్లాలో ఉన్న గర్భవతులు, బాలింతలను ఓటరు జాబితాలో నమోదు చేయడంపై శ్రద్ద వహించాలని, దీనికిగాను అంగన్ వాడీ టీచర్లను, సహాయకులను వినియోగించుకోవాలని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న కళాశాల నుంచి విద్యార్థుల్లో అంబాసిడర్లను ఏర్పాటు చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోనీ విద్యా సంస్థల్లో చదువుతున్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు జిల్లాలో ఉన్న ఆసుపత్రులలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లాలో ఉన్న వ్యాపారులతో చర్చించి వారి సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న దివ్యాంగుల జాబితా సదరం క్యాంపు నుంచి సేకరించి వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటరు ప్రాముఖ్యత వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి, డీసీవో శ్రీనివాసమూర్తి, ఎలక్ట్రోరల్ రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు), సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post