అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం:: జిల్లా కలెక్టర్ జి.రవి

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-1                                                                                                                                                                                                                                           తేదీ.27.7.2021

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల జూలై 27:- అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డు అందిస్తామని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. మంగళవారం మల్యాల మండల కేంద్రంలో రైతు వేదిక నందు ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డు దరఖాస్తులను పరిశీలించి నూతనంగా జగిత్యాల జిల్లాలో 7621 రేషన్ కార్డులను మంజూరు చేసామని తెలిపారు. ప్రస్తుతం మల్యాల మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లోని 211 కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు తప్పనిసరిగా అందిస్తామని, ప్రభుత్వం సదరు పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు మాసం నుంచి నూతన రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ రేషన్ అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టి పారదర్శకంగా నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్ తెలిపారు. ప్రస్తుతం నూతన రేషన్ కార్డులు అందిస్తున్నామని, వచ్చే మాసం లో సీఎం హామీ మేరకు 57 సంవత్సరాలకే నూతన వృద్దాప్య పెన్షన్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 ఉన్న వృద్ధాప్య పింఛన్లు 2016కు, 500 ఉన్న దివ్యాంగుల పెన్షన్ లు 3016కు కేసీఆర్ పెంచారని, అంతేకాకుండా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, వితంతువులకు సైతం పెన్షన్ అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ కష్టాలను రాష్ట్రం ఏర్పడిన ఆరు మాసాల్లో తొలగించి 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందజేస్తున్నామని తెలిపారు.

రైతు సంక్షేమమే దిశగా రైతుబంధు కింద ప్రతి ఎకరాకు 10 వేల రూపాయలు, రైతు బీమా కింద మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, రైతు పండించిన ప్రతి గింజను మద్ధతు ధరతో దేశంలోనే ఎక్కడా లేని విదంగా ప్రభుత్వంమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి దిశగా భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని, వరద కాలువ నిరంతరం నీటితో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని, మెట్ట ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నామని తెలిపారు. నూతన రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ లకు మైనార్టీలకు అదనంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించామని, విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి మనిషికి నాలుగు కిలోల బియ్యం మాత్రమే అందించేవారని, దానిని 6 కిలోలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందనే ఎమ్మెల్యే తెలిపారు.

పేదింటి మహిళల వివాహానికి సహాయం అందించడానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల పేరిట రూ.లక్షా 116 అందజేస్తున్నామని తెలిపారు. కుల వృత్తుల ప్రోత్సహించేందుకు చేపల పెంపకం గొర్రెల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం చేపడుతున్నారని, ప్రతి పేద దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.

జగిత్యాల ఆర్.డి.ఓ.మాధురి, సర్పంచులు, జెడ్పిటిసిలు,ఎంపిపిలు, ఎంపిటిసిలు, తసీల్దార్, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం:: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post