అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ విధిగా తీసుకోవాలని
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు.
గురువారం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి లో నవ్య నగర్ కాలనీ , మునిసిపల్ కార్యాలయంలో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ ను ఆయన పరిశీలించారు.
మునిసిపల్ పరిధి లో మొదటి డోసు వేసుకోని వారిని గుర్తించి,వారికి నవంబర్ 3 లోపు వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మొదటి డోసు తీసుకొని రెండవ డోసు గడువు పూర్తయిన వారి జాబితాను సంబంధిత PHC డాక్టర్ కు పంపడము జరిగిందని, జాబితాలో వున్న వారిని గుర్తించి వారందరికి ఈ నెల 30 లోపు రెండవ డోసు వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
మునిసిపాలిటీ లోని హరిజన వాడ లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే తీరును ఆయన పరిశీలించారు. సర్వే లో ఇప్పటివరకు మొదటి డోసు తీసుకోని వారిని గుర్తించి, వారికి ఇంటి వద్దనే వాక్సిన్ అందించాలని తెలిపారు.
అనంతరం అమీన్ పూర్ లో గల అంగన్వాడీ కేంద్రములో పిల్లల తల్లిదండ్రుల తో ఏర్పాటు చేసిన
తీవ్ర పోషకాహార లోపం
( SAM- Seviority Acute Malnutrished )తక్కువ బరువు పై ( Seviority Under Weight) ఏర్పాటుచేసిన సమావేశంనకు రాజార్షి హాజరయ్యారు. పిల్లల బరువు ను నిరంతరం పర్యవేక్షించాలని, మంచి పోషక విలువలు ఉన్న ఆహారము అందించాలని సూచించారు.
అంగన్వాడి కేంద్రం ఆవరణలో కిచెన్ గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ కమీషనర్ సుజాత , భానూర్ పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ స్వప్న , CDPO చంద్రకళ , అంగన్వాడీ సూపర్వైజర్, తదితరులు పాల్గొన్నారు